పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలను ప్రభావితం చేయగలిగే ఆ బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడి మౌనం వెనకాల అసలు జరుగుతుందేమిటి….?పరకాల టికెట్ ఆశించి ఆ టికెట్ తనకే వచ్చినట్లు మీడియాలో కూడా ప్రచారం జరిగిన ఆ నేత ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యాడు… అని రెండు నియోజకవర్గాల్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది… పరకాల,భూపాలపల్లి నియోజకవర్గాల్లోని కొందరు కార్యకర్తలు నాయకులు తమ లీడర్ ఎందుకు మౌనంగా ఉన్నాడని ఆరా తీస్తున్నారట…. ప్రతిసారి టికెట్ ఆశించి భంగపడి ఎవరికి టికెట్ ఇస్తే వారి గెలుపు కోసం పనిచేసిన నాగుర్ల వెంకటేశ్వర్లు అలియాస్ నవత వెంకన్న రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ చురుకుగా పనిచేయకపోవడానికి ఆ ఇద్దరు ఎమ్మెల్యే లే కారణమట తనతో ఎం పని లేదన్నట్టు కనీసం నాగుర్లను వారు ప్రచారానికి రమ్మని కూడా ఆహ్వానించడం లేదట…ప్రచారానికి వెళ్లిన సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదట…దింతో నాగుర్లలో బాగానే అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తుంది….
“చల్లా” కు కోపం పోలేదా….?
బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు నాగుర్ల వెంకటేశ్వర్లు పై పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కి ఎక్కడలేని కోపం ఉందట….పరకాల టికెట్ నాగుర్ల ఆశించడమే ఇందుకు కారణమట….టికెట్ ఆశించడం నిజమే ఐయిన టికెట్ మాత్రం అధిష్టానం చల్లా కే ఇచ్చింది…టికెట్ వచ్చిన తర్వాత నాగుర్లను కలుపుకుపోయి విజయం కోసం కృషి చేసుకోవాల్సిన చల్లా ధర్మారెడ్డి నాగుర్లను పూర్తిగా పక్కన పెట్టి “నాగుర్లతో నాకేం పని”ప్రచారానికి నేను నాగుర్లను పిలువాల…?అంటూ తన సన్నిహితుల వద్ద ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాడట….కేవలం పరకాల టికెట్ నాగుర్ల ఆశించడం వల్లే చల్లా ఆయనను పక్కనపెట్టేసారని పరకాలలో ప్రచారం జరుగుతోంది….కాగా చల్లా బాటలోనే భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి కొనసాగుతున్నట్లు సమాచారం…భూపాలపల్లి నియోజకవర్గం లో సైతం నాగుర్ల విస్తృతమైన సంబంధాలు కలిగి ఉన్న ప్రచారంలో కలుపుకుపోవడానికి గండ్ర ముందుకు రావడం లేదట….
నాగుర్ల కీలకమే…..?
పరకాల,భూపాలపల్లి నియోజకవర్గాల్లో నాగుర్ల వెంకన్న కీలకమే ఈ విషయం ఎవరిని ఆడిగిన అవుననే సమాధానం ఇస్తారు….2001 నుంచి గులాబి పార్టీలో కొనసాగుతున్న నాగుర్ల కు ఈ రెండు నియోజకవర్గాల్లో బి ఆర్ ఎస్ కార్యకర్తలతో,నాయకులతో ,తెలంగాణ ఉద్యమకారులతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి…మరోవైపు నాగుర్ల సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు సైతం ఈ రెండు నియోజకవర్గాల్లో బాగానే ఉన్నాయి…ఇవన్నీ తెలిసి కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎందుకు నాగుర్లను పక్కన పెడుతున్నారో వారికే తెలియాలి ఇప్పటికైనా తమ విధానం మార్చుకొని నాగుర్లను కలుపుకొని పోతారా…? లేక నాగుర్లతో మాకేం పని అని వదిలేస్తారా… చూడాలి…