నన్నపనేని నయా స్కెచ్…?

వరంగల్ తూర్పులో గులాబీలో స్వపక్షం నుంచి ఎదురవుతున్న పోటీని,వ్యతిరేకతను లేకుండా చేసేందుకు తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తన నయా స్కెచ్ కు మరింతగా పదును పెడుతున్నట్లు తెలిసింది….ఇప్పటికే తనకు గులాబీలో పోటీ అనుకున్న వారికి ఏదోలా చెక్ పెట్టి తనకే మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ అని సంకేతాలు ఇస్తున్న నన్నపనేని తనకు గిట్టని వారిపై ఎదో రకమైన ప్రచారం చేస్తూ హమ్మయ్య తనకు గులాబీ తూర్పులో ఇక పోటీ లేదు అని ఊపిరి పీల్చుకుంటున్నారట…. తనకు రానున్న ఎన్నికల్లో పోటీకి వచ్చే వారు,తూర్పు గులాబీ నుంచి టికెట్ ఆశించే స్థాయి ఉన్నవారిని,అధిష్టానం దగ్గర పరపతి ఉండి అధిష్టానాన్ని ఎలగోలాగ ప్రభావితం చేసేవారిని గుర్తించి మరి తనతో టికెట్ కోసం పోటిలోకి రాకుండా ముందుగానే నివారించే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం…. ఇటీవల గులాబీలో ఓ సీనియర్ రాజకీయ నేత తూర్పు విషయంలో తనకు పోటీకి నిలుస్తాడనే అనుమానంతో ఎమ్మెల్యే ఆ సీనియర్ నేత పరపతి తగ్గించేలా తెరచాటు ప్రయత్నాలు చేశారట….ఆ సీనియర్ నేత అసలు రాజకీయాలకే పనికి రాడని నియోజకవర్గంలో అందరూ అనుకుంటున్నారని,ఆయన వెనకాల అసలు ఎవరు లేరనే ప్రచారం ఎమ్మెల్యే కొనసాగించినట్లు తూర్పు గులాబీలో జోరుగా ప్రచారం జరుగుతోంది…. ఈ ప్రచారం తనదాక రావడంతో ఆ సీనియర్ రాజకీయ నేత మనసు నొచ్చుకున్నాడట… అసలు తనకు ఎమ్మెల్యే గా బరిలో దిగే ఆలోచన లేదని తూర్పు ఎమ్మెల్యే అసలు ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నాడో అర్థం కావడం లేదని పోటీలో లేని తన గూర్చి ఇలా ప్రచారం చేస్తే తనకేం లాభమని తన సన్నిహితుల వద్ద ఆ సీనియర్ నేత తన బాధను వెళ్లగక్కాడట….ఇప్పటికే పార్టీలోని కొందరు సీనియర్ లను తాను నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెడుతున్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే తాను కొనసాగిస్తున్న ఈ తెరచాటు ప్రచారం వల్ల తూర్పు గులాబీలో కొందరు నేతల్లో అసంతృప్తి పేరిగిపోతుందట…. ఇప్పటికే కొందరు సీనియర్లు ,ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే పై అసంతృప్తితో ఉండగా కొందరు ఇష్టం లేకున్నా ఏదో మొక్కుబడిగా పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నారట…ఇటీవల తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే నరేందర్ నిర్వహించిన ప్లీనరీ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదన్న టాక్ తూర్పు గులాబీలో కొనసాగుతుంది….కొందరు సీనియర్లు ఈ ప్లీనరికి దూరంగా ఉండగా ఆహ్వానం అందుకున్న వారు సైతం ఎదో రావాలని అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం నన్నపనేనికి స్వపక్షంలో వ్యతిరేకత మెల్లమెల్లగా పెరిగిపోతునట్లు తూర్పు గులాబీలో చర్చించుకుంటున్నారు….తూర్పు ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇవ్వాలనేది అధిష్టాన నిర్ణయమే ఐయిన తనకు ఎవరు పోటీకి రాకుండా ఉండేందుకు నన్నపనేని వేస్తున్న నయా స్కెచ్ లు ఇప్పుడు తూర్పు నియోజకవర్గంలో చర్చకు దారితీస్తున్నాయి….ఎమ్మెల్యే ఇలా చేసుకుంటు పోతే ఒకవేళ తనకే తూర్పు నుంచి గులాబీ టికెట్ దక్కిన సహకరించేవారు ఎవరని కొందరు ప్రశ్నిస్తున్నారు…మరోవైపు నియోజకవర్గంలో తాను బలంగా ఉన్నానని నిరూపించడం కోసం ఎమ్మెల్యే నన్నపనేని చేరికలపై దృష్టి సారించారు…. వివిధ పార్టీలోని యువ క్యాడర్ ను తనవైపు తిప్పుకొని గులాబీలో చేర్చుకుంటున్నారు… ఇది అన్ని పార్టీల్లో సర్వ సాధారణమయిన ఇటీవల ఓ చేరిక విషయంలో ఎమ్మెల్యే అపవాదు మూటగట్టుకున్నారు…బీజేపీ నుంచి ఓ యువకుడు గులాబీ పార్టీ లో చేరి తెల్లారెవరకు మళ్ళీ కాషాయం కండువా కప్పుకోవడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది….మొత్తానికి అటు చేరికల విషయంలో…సొంత పార్టీ నాయకులపై తెరవెనుక ఎమ్మెల్యే వ్యతిరేక ప్రచారం చేయడం పట్ల కొందరు తూర్పు గులాబీ నేతలు ఇదేంటనే ఆగ్రహం లొనే ఉన్నారట…ఈ విషయం ఆనోట ఈ నోటా గులాబీ బాస్ వరకు సైతం చేరిందట…. దీంతో ఎమ్మెల్యే నన్నపునేని అప్పుడే ఎందుకు ఇలా ఆత్మరక్షణలో పడ్డాడని కొందరు గులాబీ సీనియర్లు ప్రశ్నిస్తున్నారట….చూడాలి ఎమ్మెల్యే నన్నపనేని విషయంలో ఆయన అనుసరిస్తున్న విధానాల పట్ల గులాబీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here