దీని భావమేమి యాదగిరిశా…?

యాదగిరి గుట్ట యాదగిరిశుడి సాక్షిగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అవమానం జరిగింది…బట్టి తో పాటు మంత్రి కొండా సురేఖకు సైతం అవమానమే జరిగింది…సోమావారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ని దర్శించుకోగా దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించారు… ఈ సమయంలో ప్రోటోకాల్ ను తుంగలో తొక్కినట్లే కనిపించింది…ఈ ఆశీర్వచన సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సతీమణి,మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు కుర్చీల పై ఆసీనులు కాగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు నేలే దిక్కయ్యింది… ఆయనతో పాటు అదే లైన్ లో చివరగా కొండా సురేఖ సైతం నేలపైనే కూర్చున్నారు… కనీసం మహిళ మంత్రిని ముఖ్యమంత్రి సతీమణి పక్కన కూర్చుండబెట్టాలనీ ఆ కార్యక్రమ నిర్వాహకులకు అర్థం కానట్లు ఉంది.. ఉప ముఖ్యమంత్రి బట్టి నేలపై కూర్చోవడం పై సామాజిక మాధ్యమాలలో విమర్శలు,భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి…ఇది ఉద్దేశ్యపూర్వకంగ చేసింది కాదని కొందరు సమర్ధించే ప్రయత్నం చేయగా ఇంకొందరు గత ప్రభుత్వం లో లాగానే దళిత,బి సి ప్రజాప్రతినిధులకు అవమానాలు జరుగుతున్నాయని పెదవి విరిచారు….

అవమానం కాదా….?

ముఖ్యమంత్రి, ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమంలో అధికారులు ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదా… కార్యక్రమం ముగిసేవరకు ఏది జరిగిన ప్రోటోకాల్ అవసరమే కదా…. అలాంటప్పుడు ఓ దళిత సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి ,ఓ బి సి మంత్రి కొండా సురేఖ ను నేలపై ఎందుకు కూర్చోబెడతారు… ముఖ్యమంత్రి తో సహా మిగతా మంత్రులు కుర్చీలపై కూర్చోబెట్టిన అధికారులకు కేవలం మరో రెండు కుర్చీలు దొరకలేదా అని విమర్శలు వస్తున్నాయి… ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి పక్కనే ఉండాల్సిన బట్టి మంత్రి కోమటిరెడ్డి పక్కన అది నేలపైన ఎలా కూర్చోబెడతారనే విమర్శలు వస్తున్నాయి…ఇంతటి స్పష్టంగా యాదగిరిశుడి సాక్షిగా అవమానం జరిగినా ఆ విషయంలో అంతా సీన్ లేదు…విమర్శలు ఎందుకు…? భూతద్దం పెట్టకండి…అంతా పీల్ గుడ్ అనే వారు దీన్ని యాదృచ్చికంగా అలా జరిగిపోయింది అనడం బాగానే ఉన్నా ఎక్కడ కూర్చుంటే ఏంటి…?అని కుర్చీపై కూర్చున్న వారు కామెంట్ చేసిన ఈ ఏర్పాట్లు చేసిన అధికారులు దీనికి ఎం సమాదానం చెప్తారో చూడాలి…ముఖ్యమంత్రి దంపతులకు,ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఆ ఇద్దరు మంత్రులకు ప్రాధాన్యత ఇస్తే చాలు అనుకున్నారేమో ఎవరికి తెలుసు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here