తెలంగాణలో ఏనుగు ఘీంకారం….

తెలంగాణాలో ఏనుగు ఘీంకారం రోజు రోజుకు పెరిగిపోతుంది …మాజీ ఐ పి ఎస్ అధికారి ఆర్ యస్ ప్రవీణ్ కుమార్ సారథ్యంలో ముందుకు కదులుతున్న బి ఎస్ పి పై అంచనాలు పెరిగిపోతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు…ఆర్ ఎస్ పి ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టకముందు అంతగా అంచనాలు లేని బి యస్ పి పార్టీ ఆర్ యస్ పి పార్టీ పగ్గాలు చేపట్టాక బలం పుంజుకుందని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది… ఇప్పుడు బి యస్ పి టికెట్ కోసం ఆశావహులు చాలామంది క్యూ కడుతుండడం ఇందుకు నిదర్శనమని పార్టీ క్యాడర్ చెపుతోంది….ఇప్పుడు పారిలన్నింటికి బహుజనవాదంతో తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్న ఆర్ యస్ పి గుబులు పట్టుకుందని వారు అంటున్నారు…

బహుజన వాదం ఆర్ యస్ పి వ్యూహం…

తెలంగాణాలో అత్యధిక శాతం ఉండి ఎక్కువ ఓట్ బ్యాంక్ కలిగివున్న బహుజనులను రాజ్యాధికారం వైపు నడిపించాలనే ఏకైక లక్ష్యం తో భారత రాజ్యాంగం మా మ్యానిపెస్టో అంటూ చెపుతున్న ఆర్ యస్ పి తన బహుజనవాదం అనే వ్యూహంతో ఎన్నికల్లో ముందుకు కదులుతున్నట్లు తెలుస్తుంది…బహుజనులను కేవలం ఓటు బ్యాంకు గా కాకుండా వారి జీవన ప్రమాణాల్లో మార్పు తీసుకురావాలని ఇది కేవలం రాజ్యాధికారంతో మాత్రమే సాద్యం అవుతుందని ఆర్ యస్ పి భావిస్తున్నట్లు ఆ దిశలోనే తన ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రత్యర్థులను చిత్తుచేసే వ్యూహంతో ఎన్నికల ప్రచారాన్ని జెట్ స్పీడ్ తో నిర్వహించేందుకు ఇప్పటికే ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది….ఎన్నికల ప్రచారంలో వేగవంతంగా ముందుకు కదిలేందుకు బి యస్ పి శ్రేణులను సిద్ధం చేసిన ఆయన వారికి ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది… బి ఎస్ పి ఎన్నికల బరిలో నిలిచేందుకు గత కొన్ని నెలల క్రితమే తెలంగాణలో ని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఓ సర్వే సంస్థతో సర్వే చేయించి ఆయా నియోజకవర్గాల్లో బి యస్ పి కి ఉన్న అనుకూల,ప్రతికూల పరిస్థితులు, బహుజనవాదం విషయంలో నివేదికలు సిద్ధం చేసి ఏ నియోజకవర్గంలో ఎలా ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయాలో బి యస్ పి చీఫ్ ఆర్ ఎస్ పి ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం….ఇటీవలే బి యస్ పి అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటించిన ఆర్ ఎస్ పి ఆ అభ్యర్థులకు సైతం ప్రచారంలో ఏ ఏ అంశాలను ప్రస్తావించాలి,స్థానిక సమస్యలపై ఎలాంటి అవగాహనను కలిగి ఉండాలి,బహుజన వాదాన్ని ఎలా ప్రచారం చేయాలి అనే మూడు అంశాలపై బరిలో నిలువబోతున్న అభ్యర్థులకు సూచనలు చేసినట్లు తెలిసింది…. త్వరలోనే బి యస్ పి రెండో జాబితాను విడుదల చేసి ప్రచారంలో అభ్యర్థులు మరింత వేగవంతంగా దూసుకుపోయేలా వారిని సంసిద్ధం చేస్తున్నారు…ఇదిలావుండగా బి ఎస్ పి కి అనుకూలంగా ప్రచారం చేసేందుకు బహుజన వాదులు, కొన్ని ప్రజాసంఘాల నాయకులు,స్వేరో విద్యార్థి సంఘాలు తమవంతు పాత్ర పోషిస్తున్నాయి… బి ఎస్ పి నీలి జెండా ఎగురుతుందని అంచనాలు ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో వీరు తమ ప్రచారాన్ని మొదలుపెట్టి క్షేత్రస్థాయిలో దూసుకుపోతున్నట్లు బి యస్ పి వర్గాలు తెలిపాయి…ఏనుగు ఎన్నికల ప్రచారంలో మరింత వేగవంతంగా ముందుకు కదిలేందుకు బి ఎస్ పి సోషల్ మీడియా టీమ్ సైతం తమ పనిలో వేగం పెంచుతుంది…అభ్యర్థుల ప్రచారంతో పాటు తెలంగాణ చీఫ్ ఆర్ ఎస్ పి ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలిసేలా ఈ టీమ్ పనిచేస్తున్నట్లు తెలుస్తోంది…. మొత్తానికి తెలంగాణలో ఏనుగు ఘీంకారం పెరిగిపోతుంది… ఈసారి తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో నీలి జెండా ఎగురవేసి రాజ్యాధికార దిశగా ముందుకు పోవాలని ఆర్ ఎస్ పి తన రాజకీయ వ్యూహాలకు మరింతగా పదును పెడుతూ ఇతర పార్టీలకు గుబులు పుట్టిస్తున్నట్లు కనపడుతుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here