తగ్గేదెలే…

తగ్గేదెలే…. పుష్ప సినిమాతో ఫేమస్ అయిన ఈ డైలాగ్ కొన్ని నెలలుగా సోషల్ మీడియాను కుదిపేస్తుంది.పుష్ప సినిమాలోని హీరో పదే పదే ఈ డైలాగ్ ను చెప్పి తన హీరోయిజాన్ని చూపించాడు. ఇదే డైలాగ్ ప్రస్తుతం హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని వెంకటాపూర్ లో గట్టిగానే వినిపిస్తున్నట్లు తెలుస్తోంది.మొరం పేరుతో అనుమతి తీసుకోని వెంకటాపూర్ ఊర చెరువు నుండి లక్షల రూపాయలు విలువ చేసే “నల్లరేగడి” మట్టిని అక్రమంగా తవ్వుతున్న విషయాన్ని న్యూస్-10 వెలుగులోకి తీసుకురాగా స్పందించిన ఇరిగేషన్ అధికారులు సదరు వ్యక్తి కి నోటిసులు ఇచ్చినట్లు తెలిసింది .అయితే కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న సదరు వ్యక్తి తగ్గేదెలే అన్నట్లుగా మళ్ళీ రేగడి మట్టిని తవ్వుతూ ఇటుకబట్టీలకు తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.

నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న ఇరిగేషన్…

హన్మకొండ జిల్లా ఐనవోలు మండలంలోని వెంకటాపూర్ గ్రామ ఊర చెరువులో ఓ వ్యక్తి అక్రమంగా లక్షల రూపాయలు విలువ చేసే నల్ల రేగడి మట్టిని తరలిస్తున్న విషయాన్ని న్యూస్-10 వెలుగులోకి తీసుకురాగా ఆఘమేఘాల మీద స్పందించిన ఇరిగేషన్ అధికారులు సదరు వ్యక్తి నోటిసులు ఇచ్చినట్లు తెలిసింది. కానీ సదరు వ్యక్తి మొరం తీయడానికి అనుమతి తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా నల్లరేగడి మట్టిని తీస్తున్న విషయం ఇరిగేషన్ “ఏ ఈ” డి ఈ లకు తెలిసిన్నప్పటికి ఎలాంటి చర్యలు తీసుకుపోవడం వెనుక అంతర్యమేమిటని స్థానికంగా చర్చ జరుగుతోంది. చెరువులను రక్షించాల్సిన అధికారులే అక్రమంగా రేగడి మట్టి ని తీస్తున్నవారికి పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ముడుపులకు మైనింగ్ తలొగ్గిందా…?

హన్మకొండ జిల్లా మైనింగ్ అధికారి ఓ వ్యక్తి కి ఐనవోలు మండలంలోని వెంకటాపూర్ ఊర చెరువు పక్కనే ఉన్న ఓ సర్వే నెంబర్ లో 2 వేల మెట్రిక్ టన్నుల మొరం తీయడానికి జూన్ 6 వ తేదీ నుండి జులై10 వ తేదీ వరకు తాత్కాలిక అనుమతులను జూన్ 6 వ తేదీన ఇచ్చారు.కానీ సదరు వ్యక్తి నిబంధనలకు విరుద్ధంగా ఆ చెరువు నుండి వేల టిప్పర్ ల నల్ల రేగడి మట్టిని తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అనుమతులకు విరుద్ధంగా నల్లరేగడి మట్టిని తరలిస్తున్నప్పటికి మైనింగ్ అధికారులు తమకేంపట్టనట్లు వ్యవహరించడం పట్ల ముడుపులే కారణం కావచ్చనే అభిప్రాయాలు స్థానికుల నుండి వినిపిస్తున్నాయి.ఇప్పటికైనా జిల్లా మైనింగ్ అధికారులు స్పందించి నిబంధనలు విరుద్ధంగా నల్లరేగడి మట్టిని ఎంత తీసారో కొలతలు వేసి సదరు వ్యక్తి ఎంత జరిమానా విధిస్తారో చూడాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here