రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారిచేస్తు న్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది….తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే డి జి పి అంజనీ కుమార్ పై పి సి సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ని కలవడాన్ని ఈ సి తీవ్రంగా పరిగణించింది…..కాగా డి జి పి వెంట వెళ్లిన మరో ఇద్దరు ఐ పి ఎస్ అధికారులకు షోకాజ్ జారీ చేసిన ఈ సి వారిని వివరణ కోరినట్లు తెలుస్తుంది…..ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో డిజిపి రేవంత్ ను వెళ్లి కలవడాన్ని ఈసీ తప్పుపట్టినట్లు తెలిసింది…మరోవైపు డిజిపి సస్పెన్షన్ నేపథ్యంలో ఆతర్వాత సీనియర్ గా ఉన్న ఐ పి ఎస్ అధికారిని రాష్ట్ర డీజీపీ గా నియమించాలని ఈ సి చీఫ్ సెక్రటరీ ని ఆదేశించింది…