డి ఐ ఈ ఓ నోటీసుల డ్రామా…

అనుమతులు లేకుండా నడుస్తున్న కళాశాలకు హన్మకొండ జిల్లా ఇంటర్మిడియట్ విద్యాధికారి తన శాయశక్తులా సహకారం అందిస్తున్నట్లు తెలుస్తుంది….అనుమతులు లేని కళాశాలలపై కొరడా ఝుళిపిం చాల్సిన ఆ అధికారి చర్యలు తీసుకోకుండా వారికే పరోక్షంగా సహకరించినట్లు సమాధానం ఇస్తున్నారు….హన్మకొండలో ఒక్క అనుమతితో ఐదు బ్రాంచులు నిర్వహిస్తున్న గ్రావిటీ కళాశాలకు రెండు నెలల్లో రెండు నోటీసులు జారీ చేసిన డి ఐ ఈ ఓ “నేను కొట్టినట్లు చేస్తా నువ్వు ఏడ్చినట్లు చెయ్యి”….అన్న చందాన ప్రవర్తిస్తూ…విద్యార్థి సంఘాలు పిర్యాదు చేస్తే జులై నెలలో ఓ నోటీసు…న్యూస్10 లో కథనం వెలువడితే ఆగస్టు లో ఓ నోటీసు జారీ చేసి నోటీసుల డ్రామాకు డి ఐ ఈ ఓ తెర లేపినట్లు కనబడుతుంది…. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విద్యాశాఖ నిబంధనలకు విరుద్దంగా ఒకే అనుమతితో అనేక బ్రాంచీలు నెలకొల్పి వందల కొద్ధి అడ్మిషన్లు ,లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న గ్రావిటీ జూనియర్ కళాశాలలపై గత కొద్దిరోజులుగా న్యూస్ 10 అందిస్తున్న ప్రత్యేక కధనాలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపద్యంలో గ్రావిటీ విద్యా సంస్థల నిబంధనల అతిక్రమణ విషయంలోహన్మకొండ డీఐఈఓ గోపాల్ ను న్యూస్ 10 ప్రతినిధి వివరణ కోరగా దాటవేత ధోరణి తో సమాధానం ఇస్తున్నారు. ఎట్టకేలకు చర్యల పేరుతో షోకాజ్ నోటీసులు జారీ చేసిన ఆయన కొత్త నాటకానికి తెరలేపినట్లుఅర్థం అవుతుంది. పైగా న్యూస్ 10 కధనాలకు స్పందించినట్లు కలరింగ్ ఇచ్చిన ఆయన గ్రావిటీ విద్యా సంస్థలతో పాటు మరి కొన్ని అనుమతిలేని కళాశాలలకు పరోక్షంగా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. గ్రావిటీ కళాశాలలకు ఈ నెల 16 న నోటీసులు జారీ చేసిన ఆయన గ్రావిటీ కాలేజీకి గత నెల జులై 24 న కూడా నోటీసులు జారీ చేసినట్లు న్యూస్ 10 పరిశీలనలో తేలింది .అంటే ఒకే గ్రావిటీ కాలేజీకి రెండు సార్లు నోటీసులు జారీ చేసినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు అనేది స్పష్టమవుతోంది. పైగా నోటీసులు అందుకొని నెల గడుస్తున్నా వారి నుండి ఎలాంటి సమాధానం రాకపోయినా వారిపై డీఐఈఓ గోపాల్ ఎందుకు చర్యలకు వెనుకడుతున్నారో,దాని వెనకాల ఉన్న మతలబు ఏంటో ఆ అధికారికే తెలియాలి… అనుమతులు లేని కళాశాలలపై చర్యలు తీసుకోవడానికి డి ఐ ఈ ఓ ఎందుకు వెనుకాడుతున్నారని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు సైతం ప్రశ్నిస్తున్నారు.కాగా గ్రావిటీ కళాశాలకు రెండు నోటీసులు ఇచ్చిన డీఐఈఓ సదరు కళాశాల యాజమాన్యానికీ ఫోన్ చేసి తాను ఇచ్చిన నోటీసుకు ఇలా బదులు ఇవ్వాలని,ఏమి కాకుండా అంతా తాను చూసుకుంటానని వారికి ఉచిత సలహా ఇస్తూ అండగా నిలుస్తున్నట్లు సమాచారం.ఇదిలాఉంటే
రెండు సార్లు నోటీసులు ఇచ్చినా వారి నుండి ఎందుకు సమాధానం రావడం లేదంటూ న్యూస్ 10 ప్రతినిధి డీఐఈఓ ను ప్రశ్నించగా వాళ్లే పంపిస్తారు….. అంటూ కూల్ గా సమాధానం ఇస్తూ పైగా వారితో మీకు ఫోన్ చేయిస్తా అంటూ కళాశాల యాజమాన్యానికి, న్యూస్ 10 ప్రతినిధికి మధ్య వర్తిత్వం వహించే పాత్రను కూడా పోషించే ప్రయత్నం చేస్తుండటం కొసమెరుపు. ఫోన్ మాకొద్దు వారిపై చర్య తీసుకోండి అంటూ న్యూస్10 ప్రతినిధి సమాధానం ఇవ్వగా…మీ ఇష్టం ఏదైనా రాసుకోండి… అని తెగేసి చెప్పడంతో నిబంధనలు అతిక్రమించి కలశాలలు నడుపుతున్న యాజమాన్యాలకు డీ ఐ ఈ ఓ ఏ విదంగ సహకరిస్తున్నారో ఇట్టే అర్ధమవుతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here