హన్మకొండ టి బి ఆసుపత్రిలో నిబంధనలకు విరుద్ధంగా పేషంట్ కేర్ ఉద్యోగులతో తమకు తోచిన పనులు చేయిస్తున్న ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ ఎం ఓ ,హెడ్ నర్స్ లు ఆసుపత్రిలో మరింత అతిగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది…ఆసుపత్రి తమ జాగిరి అన్నట్లు,ఉద్యోగాలు తీసివేయడం తమ ఇష్టం అన్నట్లు పేషంట్ కేర్ ఉద్యోగులను నానా కష్టాలు పెడుతున్నట్లు తెలియవచ్చింది..పేషంట్ కేర్ ఉద్యోగులతో నిబంధనలకు విరుద్ధంగా వారికి సంబంధం లేని పనులు చేయిస్తున్నారని బుధవారం న్యూస్10 లో కథనం వెలువరించగా గురువారం టి బి ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ ఎం ఓ,హెడ్ నర్స్ లు మరింతగా రెచ్చిపోయారట…తమకు నిబంధనలకు ఎం పనులు చెప్పడం లేదని,ఇందులో సూపరింటెండెంట్, ఆర్ ఎం ఓ ,హెడ్ నర్స్ ల పాత్ర ఏమాత్రం లేదని ఆసుపత్రి అధికారులే ఓ పేపర్ పై రాసి సంతకాలు పెట్టాలని పేషంట్ కేర్ ఉద్యోగులను ఒత్తిడి చేశారట…సంతకాలు చేయకుంటే ఉద్యోగాల నుంచి తీసివేస్తామని బెదిరింపులకు దిగారట…. ఉదయం విధులకు హాజరైన దగ్గరనుంచి వారిని నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తూ సంతకాలు చేయాలని బెదిరించినట్లు తెలియవచ్చింది…అధికారులు ఎంతగా బెదిరింపులు దిగిన కానీ పేషంట్ కేర్ ఉద్యోగులు మాత్రం సంతకాలు చేయలేదని తెలిసింది…కాగా ఆసుపత్రిలో సూపరింటెండెంట్, ఆర్ ఎం ఓ,హెడ్ నర్స్ ల అతిగా తెరదించాల్సిన ఉన్నతాధికారులు వారికే వంత పాడుతున్నట్లు తెలిసింది… న్యూస్10 కథనంతో ఆసుపత్రి కి వచ్చిన ఓ అధికారి ఆసుపత్రి అధికారులకే సహకరిస్తున్నట్లు పేషంట్ కేర్ ఉద్యోగులను పేపర్ పై సంతకం చేయాలని ఒత్తిడి చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది….