ఆ కార్యాలయంలో ఆయన పేరుకే జూనియర్ అసిస్టెంట్ కాని అన్ని పనుల్లో ఆయన వేలు పెడతారు…ఏ పని కావాలన్న తనను సంప్రదిస్తే చాలు అన్నట్లుగా వ్యవహరిస్తూ కార్యాలయంలో పనులన్ని తానే చక్కదిద్దుతానని చెప్పుకుంటాడాట… అవును మరి ఆ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ ది ఒకటి కాదు రెండు కాదు త్రిపాత్రాభినయమట… త్రి పాత్రాభినయం అంటే కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్,అనధికార డాక్యుమెంట్ రైటర్,రిజిస్ట్రేషన్లు చేయడానికి మధ్యవర్తిగా వ్యవహరించే పైరవికారుడు…ఇలా మూడు పాత్రల్లో జూనియర్ అసిస్టెంట్ రాణిస్తూ అందినకాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి… ఈ పరిస్థితి ఎక్కడి దాకా పోయిందంటే పరకాల సబ్ రీజిస్ట్రార్ కార్యలయంలో జూనియర్ అసిస్టెంట్ ను కలిస్తే చాలు అనే స్థాయికి వెళ్ళిందట….
జూనియర్ అసిస్టెంట్ ఇష్టారీతి…?
హన్మకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ తాను ఆడింది ఆటగా పాడింది పాటగా నడుస్తుందని పలువురు అంటున్నారు…ఈ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయడం కోసం ఇయనగారిని ప్రసన్నం చేసుకుంటే చాలు చిటికెలో పని అయిపోతుందని తెలుస్తుంది… డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ విషయంలో ఒకటి అర ధృవ పత్రాలు ఏమైనా తక్కువ గా ఉన్న వాటిని ఎలా మ్యానేజ్ చేసి పని ముగించాలో జూనియర్ అసిస్టెంట్ కు కొట్టినపిండేనట…రిజిస్ట్రేషన్లు చేయించడంలో ఆరితేరి బాగానే చేయి తిరిగిన ఇతగాడు కావాల్సింది ముట్టజెపితే చాలు ఎంతటి కఠినమైన పని ఐయిన చిటికెలో చేసిపెడతాడని తెలిసింది…. అంతేకాదు కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించే ఇతగాడు పనులకోసం ఎవరైనా వస్తే కలవడం కోసం కార్యాలయం బయట ఓ వ్యక్తిని నియమించుకున్నాడట…జూనియర్ అసిస్టెంట్ గా ఉద్యోగం చేస్తూనే తన దందా ఆగకుండా దండుకోవడం కోసం ఏకంగా ఓ వ్యక్తినే నియమించుకున్నాడంటే అవినీతిలో జూనియర్ అసిస్టెంట్ బాగానే ఆరితేరిపోయాడని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి….
సబ్ రిజిస్ట్రార్ ఎం చేస్తున్నట్లు…?
వాటాల్లో భాగం ఉందా….?
మరోసంచికలో