జూనియర్లకు అందలం….స్త్రీ శిశు సంక్షేమ శాఖలో గందరగోళం

రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ప్రస్తుతం అంతా గందరగోళం నెలకొన్నట్లు కనపడుతోంది…”దుడ్డు ఉన్నోడిదే బఱ్ఱె”..అన్న చందాన గత ప్రభుత్వంలో పైరవీలకు,డిప్యుటేషన్ లకు పెద్ద పీట వేసి ఓ శాఖ ఉద్యోగులకు మరో శాఖ బాధ్యతలు అప్పగించగా కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంలో సైతం అదే విధానం కొనసాగుతుందని ఈ శాఖ ఉద్యోగులు పెదవి విరుస్తున్నారు…ఈ శాఖలో ప్రధానంగా సీనియర్ల ను పక్కన పెట్టి జూనియర్లను అందలం ఎక్కించారని రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో జూనియర్ అధికారులు, గెజిటెడ్ హోదా లేనివారు సైతం జిల్లా బాస్ లుగా కొనసాగుతూ గెజిటెడ్ హోదా ఉన్న సీనియర్ అధికారులపై పెత్తనం చేలాయిస్తున్నట్లు తెలుస్తుంది…గత ప్రభుత్వ పాలనలో ఏదోఒకరకంగా వీరు పోస్టు ను కొట్టేసి తమకంటే సీనియర్లను ఓవర్ టేక్ చేసి వారికి వీరు బాస్ లుగా మారి పోజులు కొడుతున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో చర్చ జోరుగా సాగుతుంది….


ఎఫ్ ఏ సీ ల తంతు….?

రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ లో గత ప్రభుత్వం కొనసాగించిన ఎఫ్ ఏ సి లు ఇప్పుడు కొనసాగిస్తున్నారు…ఈ ఎఫ్ ఏ సి లు అనర్హులకు కట్టబెట్టారనే ఆరోపణలు సైతం బాగానే వినపడుతున్నాయి…కొన్ని జిల్లాల్లో ఈ శాఖ ఉన్నతాధికారులతో ఏమాత్రం సంబంధం లేకుండా అక్కడి కలెక్టర్ లు తమకు ఇష్టం వచ్చిన వారికి,ఎలాంటి అర్హతలు లేనివారికి పోస్టులు కట్టబెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…. ఓ జిల్లాలో ఏకంగా జిల్లా సంక్షేమ అధికారిగా ఓ జూనియర్ కు బాధ్యతలను అప్పగించి ఆ జిల్లా పరిధిలో ఉన్న సీనియర్ గెజిటెడ్ అధికారులు సి డి పి ఓ లుగా జూనియర్ అధికారి కింద పనిచేస్తున్నట్లు తెలిసింది…మొన్నటివరకు ఇలాగే పనిచేసిన ఈ అధికారులు కొత్త ప్రభుత్వం,శాఖకు కొత్త మంత్రి రావడంతో మార్పు కనపడుతుంది…అర్హులకు పోస్ట్ దక్కుతుంది అని భావించిన ఇప్పటివరకు సంబంధిత శాఖ మంత్రి ఈ విషయంపై పూర్తి దృష్టి సారించకపోవడం ఈ శాఖ ఉద్యోగుల్లో అసంతృప్తి కి కారణం అవుతుంది….మంత్రికి సంబంధించిన ఈ జిల్లా లో ఇలాంటి విధానం కొనసాగుతుండగా, మేడారం జాతర ఇదే జిలాల్లో ఉండడం,జాతర సమయంలో ఈ శాఖ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడి అధికారి విషయంలో సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా… సీనియర్ అధికారి ని జిల్లా సంక్షేమ అధికారి (డి డబ్ల్యు ఓ) గా నియమించకపోవడం జాతర సమయంలో కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అక్కడి ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది… జూనియర్ గా ఉన్న అక్కడి అధికారి ఇప్పటికే కేవలం ఓ ముగ్గురు సి డి పి ఓ లకు మాత్రమే విధులు కేటాయించి కింది స్థాయి ఉద్యోగులకు అధికశాతం వారికే విధులు కేటాయించడంతో ఉద్యోగులనుంచి విమర్శలు వచ్చి కలెక్టర్ కార్యాలయం లో పిర్యాదు చేసే వరకు వెళ్లినట్లు సమాచారం… దింతో స్పందించిన కలెక్టర్ కార్యాలయం జిల్లాలో ఉన్న అందరు సి డి పి ఓ లకు విధులు కేటాయించినట్లు సమాచారం…అనుభవ లేమి,ఎం చేసిన చెల్లుతుందనే భావనతో ఆ జిల్లా సంక్షేమ అధికారి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నట్లు తెలిసింది…..

ఇతర శాఖల నుంచి వలస….?


స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగులు సరిపడా ఉన్నప్పటికీ,సీనియర్లు ,అర్హత ఉన్నవారు ఉన్న ఇతర శాఖలనుంచి డిప్యుటేషన్ రూపంలో ఎఫ్ ఏ సి కేటాయించి కొందరు ఉద్యోగులను జిల్లా సంక్షేమ అధికారులుగా కొనసాగిస్తున్నారు….గత ప్రభుత్వం దాదాపు 11 మంది ఉద్యోగులను ఇతర శాఖలనుంచి జిల్లా సంక్షేమ అధికారులుగా నియమించింది…. వారు వారి మాతృ శాఖలో పనిచేస్తూ ఈ శాఖలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ సొంత శాఖ లోని గెజిటెడ్ సీనియర్ అధికారులకు బాసులుగా కొనసాగుతుండడం ఈ శాఖ ఉన్నతాధికారులు దాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం ప్రభుత్వం మారిన ఏ మార్పు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది…. ఇప్పటికైనా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంలో దృష్టి సారించి అందలం ఎక్కిన జూనియర్లను కిందికి దింపుతారా…ఎఫ్ ఏ సి లు రద్దు చేసి అర్హులకు పోస్టులు కట్టబెడుతారా….ఇతర శాఖలనుంచి వచ్చిన జోడు ఉద్యోగులను వారి మాతృ శాఖలకే పరిమితం చేస్తారా…లేదా…? వేచి చూడాలి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here