జననం,కొప్పుల హరీశ్వర్ రెడ్డి 18 మార్చి 1947లో తెలంగాణ రాష్ట్రం , వికారాబాదు జిల్లా , పరిగి గ్రామంలో జన్మించాడు..

రాజకీయ జీవితం కొప్పుల హరీశ్వర్ రెడ్డి 1972 నుంచి 1977 వరకు పరిగి ఉప సర్పంచ్‌గా , 1977 నుంచి 1983 వరకు సర్పంచ్‌గా పని చేశాడు. ఆయన 1983లో స్వతంత్ర అభ్యర్థిగా పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ షరీఫ్ చేతిలో 56 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యాడు.[1] కొప్పుల హరీశ్వర్ రెడ్డి 1983లో తెలుగుదేశం పార్టీలో చేరి, 1985లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అహ్మద్ షరీఫ్ పై 32512 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.*

*ఆయన 1986 – 1988 వరకు ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా , 1988 – 1989 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యుడిగా పని చేశాడు. కొప్పుల హరీశ్వర్ రెడ్డి 1994 , 1999, 2004 , 2009లో పరిగి నియోజకవర్గం నుండి పోటీ చేసి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.* *ఆయన 1997 – 2003 వరకు రాష్ట్ర ఆర్ధిక సంస్థ అధ్యక్షుడిగా, 31 డిసెంబర్ 2001 నుండి 14 నవంబర్ 2003 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గా పని చేశాడు..*

*ఆయన తెలంగాణ ఉద్యమం సమయంలో 15 నవంబర్ 2012లో తెలుగుదేశం పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి పార్టీ టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమితుడయ్యాడు. హరీశ్వర్ రెడ్డి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి.రామ్మోహన్ రెడ్డి చేతిలో 5163 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాడు.* *ఆయన 77 సంవత్సరాల సుదీర్ఘ జీవితకాలంలో ప్రజలకు ఎనలేని సేవలు అందించిన గొప్ప మహా నాయకుడు ఇక లేరని తెలుపుటకు పరిగి ప్రజలము ఎంతో చింతిస్తున్నాం పెద్ద సార్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here