జనగామ ఆర్టీఏ లో ఆ ఇద్దరి అధికారుల వ్యవహారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. వాహనదారుల నుండి లంచాలు దండుకోవడంలో వీరిరువురు పోటీ పడి వసూళ్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ అధికారులిద్దరు కార్యాలయంలో లంచం లేనిదే ఏ ఫైలు ముట్టుకోవడంలేదని కార్యాలయంలో పనులకోసం వెళ్లిన వాహనదారులు కోడైకూస్తున్నారు .వీరిద్దరు ప్రైవేట్ అసిస్టెంట్ లను నియమించుకొని వాహదారులనుండి వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.మరీ ముఖ్యంగా కార్యాలయ పరిపాలనాధికారి లంచాల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని వాహనదారులు లోలోపల మదనపడుతున్నారు… గతంలో అంతరాష్ట్ర వాహనాల వ్యవహారంలో ఉన్నతాధికారులు సస్పెండ్ చేసినా ఇక్కడ పనిచేస్తున్న అధికారి తన వక్రబుద్దిని అలాగే కొనసాగిస్తున్నట్లుగా తెలిసింది. ఈయన వ్యవహారం ఇలావుంటే జూనియర్ అసిస్టెంట్ వ్యవహారం మరోలా ఉంది… ఈ ఉద్యోగి గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే కార్యాలయంలో పాతుకుపోయి వాహనదారుల వద్ద నుండి అందినకాడికి దండుకుంటున్నట్లు తెలుస్తోంది.రాష్ట్ర యూనియన్ నాయకుల అండదండలు తనకు పుష్కలంగా ఉన్నాయని కాబట్టే తనను ఎవరూ ఏంచేయలేరనే ధీమాతో ఈ ఉద్యోగి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వాహనదారుల వద్దనుండి మామూళ్ల రూపంలో లంచాలు వసూళ్లు చేస్తున్న వీరిరువురిపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు దృష్టి సారించాలని పలువురు వాహనదారులు కోరుతున్నారు.
జనగామ ఆర్టీఏ కార్యాలయంలో బూస్ట్ ల జోరు ….?
లంచాలకు కోడ్ లతో పేర్లు…?
సింగిల్ బూస్ట్,డబుల్ బూస్ట్, పాంచ్ బూస్ట్ ల పేరుతో వసూళ్లు?
మరో సంచికలో…