చెప్పింది చేయండి….

చెప్పింది చేయండి… కార్యాలయంలో వసూళ్లు ఆపకండి…బూస్టుల పేరుతో కొనసాగిస్తున్న అక్రమ వసూళ్లు ఇంకా పెంచండి….ఎవరు ఆపుతారో చూస్తా…అంటూ జనగామ డి టి ఓ కింది స్థాయి అధికారులకు ,అనధికార హుకుం జారిచేసినట్లూ తెలిసింది….అక్రమ వసూళ్లపై మీడియాలో వార్తలు వస్తే వసూళ్లు చేయడం ఆపుతామా…?అన్నట్లు వసూళ్లపై తగ్గేదే లేదని జనగామ డి టి ఓ తన సిబ్బందితో తెగేసి చెపుతున్నారట…జనగామ రవాణాశాఖ కార్యాలయంలో అక్రమ వసూళ్లపై విమర్శలు వస్తున్న డి టి ఓ మాత్రం డోంట్ కేర్ అంటున్నారట…ప్రభుత్వ పెద్దలు అండగా ఉండగా రవాణాశాఖ ఉన్నతాధికారులు తననేం చేస్తారని డి టి ఓ అంటున్నట్లు సమాచారం…

అక్రమాస్తులపై భయం..భయం…?

జనగామ రవాణాశాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఏవో, జూనియర్ అసిస్టెంట్ లకు ఇప్పుడు కొత్త భయం పట్టుకుందట …అక్రమవసూళ్ల ఆరోపణలతో ఇంతకుమునుపు సస్పెండ్ అయి జనగామలో కొలువు చేస్తున్న ఏ ఓ వసూళ్లు చేయడం తనకు వెన్నతో పెట్టిన విద్య లాగ ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తుంది…ఇదే కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్ సైతం డి టి ఓ,ఏ ఓ లకు సహకరిస్తూ ఇతగాడు సైతం ఓ టార్గెట్ తో బాగానే వెనకేసినట్లు తెలుస్తుంది…ప్రస్తుతం ఈ వసూళ్ల త్రయానికి అక్రమఆస్తులపై ఆరా తీస్తే ఎలా …అనే భయం బాగా పట్టుకుందట….ఈ వసూళ్ల త్రయం లో జూనియర్ అసిస్టెంట్ ఇటీవలే హన్మకొండలో మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ఓ అందమైన భవంతి నిర్మించినట్లు తెలియవచ్చింది…తీగ లాగితే డొంక కదిలినట్లు వసూళ్లపై ఏ సి బి విచారణ చేస్తే అక్రమాస్తుల చిట్టా సైతం బయట పడుతుందని వీరికి భయం పట్టుకున్నట్లు సమాచారం…

యస్ టి ఏ ఆరా….?

జనగామ రవాణాశాఖ కార్యాలయంలో అక్రమ వసూళ్లు ,డి టి ఓ వ్యవహారంపై స్టేట్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ ఆరా తీసినట్లు తెలిసింది…న్యూస్10 లో వరుసగా వస్తున్న కథనాల విషయంలో డి టి ఓ పై యస్ టి ఓ అధికారులు సీరియస్ ఐయినట్లు తెలిసింది… దింతో జనగామ డి టి ఓ అగ్గి మీద గుగ్గిలం అయ్యారట… కార్యాలయాన్ని సరిదిద్ది ,అక్రమ వసూళ్లకు స్వస్తి పలకాల్సింది పోయి అసలు సమాచారం న్యూస్10 కు ఎలా తెలుస్తుందని ఆరా తీసే పనిలో పడ్డారట డి టి ఓ…

ఉన్నతాధికారుల మౌనం…..?
జనగామ రవాణాశాఖ కార్యాలయంలో అడ్డగోలు వసూళ్లను ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న డి టి ఓ వ్యవహారంపై ఇన్ని రోజులుగా రవాణాశాఖ ఉన్నతాధికారులు పూర్తి మౌనం వహించడం పట్ల రవాణాశాఖ ఉద్యోగుల్లో,వాహనదారుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…. ప్రభుత్వం మాదే అంటూ అందరిని నమ్మించి, భయపెట్టి బురిడీ కొట్టిస్తాడని పేరున్న డి టి ఓ రవాణాశాఖ ఉన్నతాధికారులను సైతం ప్రభుత్వ పెద్దల పేరుచెప్పి భయపెడుతున్నాడా…?అని సందేహలు సైతం కొందరు వ్యక్తం చేస్తున్నారు…. మరి ఇప్పటికైనా ఈ డి టి ఓ పై చర్యలు తీసుకోని అనుమానాలకు ఉన్నతాధికారులు చెక్ పెడతారా…లేదా చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here