పరకాల రాజకీయం రసవత్తరంగా మారుతోంది…ఇక్కడ బి ఆర్ ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గెలుపు నల్లేరుమీద నడకే అనుకున్న పరకాల నియోజకవర్గంలో రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఈ నియోజకవర్గంలో బిఆర్ఎస్ ను వీడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఓ వైపు ధర్మారెడ్డి ఇతర పార్టీ నేతలను బి ఆర్ ఎస్ లో చేర్చుకుంటున్న ,మరోవైపు గులాబీ నేతలు కార్యకర్తలు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు..దింతో చల్లా ధర్మారెడ్డి కి తలనొప్పి మొదలయింది…పరకాల నియోజకవర్గంలో ఇప్పటికే ఆత్మకూరు ఎంపిపి, జెడ్పీటీసీ, పరకాల ఎంపిపి తో పాటు కొంతమంది సర్పంచ్ లు, ఎంపిటిసి లు బిఆర్ఎస్ పార్టీ కి గుడ్ బై చెప్పగా. తాజాగా బిఆర్ఎస్ నాయకుడు 2018 ఎన్నికల్లో చల్లా గెలుపులో కీలక పాత్ర పోషించిన కొండా ప్రధాన అనుచరుడు గోపాల నవీన్ రాజ్ పార్టీ వీడడం ఖాయమైనట్లు ప్రచారం జరుగుతోంది. పరకాల నియోజకవర్గంలో ఇప్పటికే చల్లాకు జంప్ జిలానీల వ్యవహారం గుబులు కలిగిస్తుండగా తాజాగా పరకాల నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ యువనాయకుడు గజ్జి విష్ణు గులాబీ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం మింగుడు పడటంలేదని తెలుస్తోంది.నియోజకవర్గంలోని పరకాల, ఆత్మకూరు, నడికుడ,దామెర మండలాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఉద్యమకారుడు, గూడెప్పాడ్ మార్కెట్ వైస్ చైర్మన్ గా కొనసాగిన గజ్జి విష్ణు పరకాల నియోజకవర్గం నుండి బి ఆర్ ఎస్ నుంచి రెబల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడం “చల్లా ” కు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది.
బి ఆర్ ఎస్ ఓట్లకు భారీ గండి..
పరకాల నియోజకవర్గం నుంచి బి ఆర్ ఎస్ ఎమ్మెల్యే రెబల్ అభ్యర్థిగా గజ్జి విష్ణు నామినేషన్ వేయడంతో ఈ నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ ఓట్లకు భారీగా గండిపడుతుందని నియోజకవర్గంలోని గులాబీ పార్టీలో చర్చ జరుగుతుంది….తెలంగాణ ఉద్యమకారుడు, గూడెప్పాడ్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గజ్జి విష్ణు బి ఆర్ ఎస్ రెబల్ అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేయడంతో “చల్లా “ఓట్లు భారీగా చీలే అవకాశం కనిపిస్తోంది. దామెర మండలం పసరగొండ గ్రామానికి చెందిన విష్ణు పరకాల, నడికుడ ,దామెర,ఆత్మకూరు మండలాల్లో పట్టు ఉన్నట్లు తెలుస్తుంది.నాలుగు మండలాల ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకునే యువ నాయకుడు ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉండటంతో సుమారు 20 వేల ఓట్ల పై ప్రభావం పడే అవకాశం ఉందని సమాచారం .మరోవైవు బి ఆర్ ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన గజ్జి విష్ణు ను బుజ్జగించే పనిలో పడినట్లు తెలుస్తుంది….