గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో లీకేజీల వర్కుల పేర అధిక బిల్లులు చెల్లించి కాంట్రాక్టర్ల నుండి లక్షల్లో ముడుపులు తీసుకున్న ఆ డీఈ,ఏఈ ల వ్యవహారంపై గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ స్పందిస్తారా అనేది ఇప్పుడు నగర ప్రజల్లో ఉత్పన్నమవుతున్న ప్రశ్న.నగరంలో ఎక్కడ లీకేజీ వర్కులు ఉన్నా ఎలాంటి టెండర్ లేకుండా ఆ ఇద్దరు కాంట్రాక్టర్లకె వర్కులు కట్టబెట్టడం వెనుక ఉన్న అధికారుల అంతర్యం పై మున్సిపల్ కమిషనర్ వారిపై శాఖ పరమైన చర్యలకు పునుకుంటారో లేదో వేచి చూడాలి మరి.గ్రేటర్ కు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు ఇచ్చిన దరఖాస్తు కు మున్సిపల్ అధికారులు బదులిస్తారా అనేది జిల్లా లో జోరుగా చర్చ జరుగుతుంది.కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసి జేబులు నింపుకొని హైదరాబాద్ లాంటి మహా నగరంలో విలాసవంతమైన విల్లా లను కొనుగోలు చేసేందుకు సిద్దమవుతున్న డీ ఈ ,ఏ ఈ లను త్రినగరికి ఉన్నత హోదాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ ప్రజాప్రతినిధి వారిని వెనకేసుకొస్తున్నట్లు గుసగుసలు బాగానే వినిపిస్తున్నాయి.దీనికి గాను ఆ ప్రజా ప్రతినిధికి కాంట్రాక్టర్ల తో సహా డీఈ,ఏఈ పెద్దమొత్తంలో సొమ్మును ముట్టజెప్పినట్లు సమాచారం.అందుకేనేమో ఎన్ని కధనాలు ప్రచురించిన ఎంత మంది నాయకులు వారిపై పిర్యాదు చేసిన తమకేమీ కాదని దైర్యంగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. పైగా వీరి అవినీతి అక్రమాలపై కమిషనర్ కు పిర్యాదు చేసిన ఆ గ్రేటర్ నాయకున్నే రాజకీయ ఒత్తిళ్లు తో లెటర్ ను వెనక్కి తీసుకునే విధంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది అయినా వినకపోతే బెదిరించే ప్రయత్నం కూడా చేసేందుకు సిద్ధపడతారన్న ఆరోపణలు కూడా వినపడుతున్నాయి .అయిన అధికారులకు ప్రజాప్రతినిధులకు అంత ధైర్యం అందిస్తున్న ఆ నేత ఎవరో వారిపై కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి మరి……