అక్రమ ఇన్స్యూరెన్స్ దందాలో అతగాడు గురువుకంటే ఘనుడట…మొన్నటివరకు గురువుతో అంటకాగి ముఠా లో కీలకంగా వ్యవహరించాడట… ఇప్పడు రాముడిని వదిలిన “శ్రీకాంతు”డు గురువును మించిన శిష్యుడిలా మారిపోయి అడ్డుఅదుపు లేకుండా అక్రమ ఇన్స్యూరెన్స్ దందాలో ఆరితేరినట్లు జోరుగా ఆరోపణలు వస్తున్నాయి…టాస్క్ పోర్స్ ఈ ముఠా పై దృష్టి సారించి వారి అక్రమాల ఆటకట్టించేవరకు గురువుతోనే ఉన్న శ్రీకాంతుడు ఇప్పుడు సొంతంగా తన ఇన్స్యూరెన్స్ అక్రమ దందాను కొనసాగిస్తున్నట్లు తెలిసింది…వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం లోని ఒకే గ్రామానికి చెందిన ఈ గురు,శిష్యులు విడి పోగా ఇప్పుడు శిష్యుడు కొంతమందిని కూడగట్టి సొంతగా ఇన్స్యూరెన్స్ దందాకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది… అక్రమ దందాను జోరుగా నడుపుతున్న శ్రీకాంతుడు ఇన్స్యూరెన్స్ లే కాకుండా ఏ దిక్కుమొక్కు లేనివారి పేరుపై వాహనాలు సైతం తీసుకొని మరో కొత్త దందాకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తుంది… ఇతగాడి దగ్గర ఇప్పుడు గ్రామంలో ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు,కార్లు ఉన్నట్లు తెలిసింది…ఐయితే వీటిని కొందరి పేరుపై ఈ ఎం ఐ తరహాలో తీసుకొని వారు మరణిస్తే మొత్తం వాహన రుణం మాఫీ కావడంతో ఇతగాడు లబ్దిపొందుతున్నట్లు ప్రాథమికంగా తెలిసింది..అంతే కాదు గతంలో ఇతగాడిపై అనేక ఆరోపణలు ఉండగా అమాయకుల పేరుపై ఇన్స్యూరెన్స్ చేసి వాటిని కాజేయడానికి ఇతగాడు చేయని అకృత్యాలు లేవని కొందరు ఆరోపిస్తున్నారు… గతంలో ఇతగాడిపై ఇలాంటి ఆరోపణలు బాగానే ఉండగా వాటినుంచి తెలివిగా తప్పించుకున్న శ్రీకాంతుడు ములుగు జిల్లాలోని ఓ మండలం పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది…ఇన్స్యూరెన్స్ విషయంలో ఓ వ్యక్తి మరణిస్తే ఇతగాడిపై మృతుడి భార్య బాహాటంగానే ఆరోపణలు చేసినట్లు సమాచారం….
పాతికేళ్ల మోసగాడు….
ఇన్స్యూరెన్స్ అక్రమ దందాలో శ్రీకాంతుడి లీలలు..
మరో సంచికలో….