ఆ గురుకులంలో ప్రిన్సిపాల్ అతి ప్రతి చిన్న విషయానికి విద్యార్థులను చితకబాదడం వల్ల అక్కడ విద్యార్థులు భయంతో వణికి పోతున్నారు….ఇదే గురుకులంలో రెండు బుక్కల అన్నం ఎక్కువ తిన్న,ప్రిన్సిపాల్ చూస్తుంటే నీళ్లు తాగిన ఆయనకు కోపాన్ని తెప్పిస్తోందట…. కోపం అంటే అలాంటి ఇలాంటి కోపం కాదు విద్యార్థులను తన ఇష్టారీతిన కొట్టేంత కోపమట….హద్దులు మీరుతున్న ప్రిన్సిపాల్ కోపం వల్ల ఇక్కడ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు గురుకులంలో ఉండాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు…విద్యార్థుల పట్ల ఇంతటి కర్కశంగా వ్యవహరిస్తూ విద్యార్థులను నిత్యం చితక బాదుతుంది మడికొండ లోని వర్ధన్నపేట సాంఘిక సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాలలో…
ఇదేం పద్ధతి సార్…..?
గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రిన్సిపాల్ మానసికంగా, శారీరకంగా వేదిస్తున్నట్లు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు….కనీసం గురుకులంలో ఉన్న చిన్న పిల్లల్ని కూడా చూడకుండా వారిని తీవ్రంగా తలపై, మెడపై కొడుతున్నట్లు చెపుతున్నారు… అన్నం తినే సమయంలో పొరపాటున అన్నం కిందపడితే విద్యార్థి దాన్ని పడేయడానికి వెళుతుంటే కిందపడిన అదే అన్నాన్ని అదే విద్యార్థికి బలవంతగా ప్రిన్సిపాల్ తినిపించినట్లు తెలిసింది…. అంతేకాదు ఓ ఇద్దరు విద్యార్థులను అకారణంగా రెండు రోజుల పాటు పాఠశాల గేటు వద్ద ఎండలో కూర్చోబెట్టి వేదించినట్లు విద్యార్థులు అంటున్నారు….దీనివల్ల ప్రిన్సిపాల్ ను చూస్తే గురుకులంలోని విద్యార్థులు చదుకోవడం ఏమో గాని ఏ విషయంలో సారు ఏ విద్యార్థిని ఏ రీతిలో చితకబాదుతాడోనని భయపడే పరిస్థితి ఉంది….
సస్పెండ్ ఐయిన తీరు మారలే….
విద్యార్థులను అకారణంగా చితకబాదుతున్న ప్రిన్సిపాల్ ను గతంలో గురుకులాల కార్యదర్శి సస్పెండ్ చేసిన ఆయన ప్రవర్తన తీరు ఏమాత్రం మారలేదు… అలాగే విద్యార్థులను చితకబాదుతు వారిని భయపెడుతున్నారు….విద్యారులవిద్యార్థుల పట్ల ఇలా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్ పట్ల చర్యలు తీసుకోవడానికి గురుకులాల అధికారికి తీరిక లేనట్లు వ్యవహరిస్తున్నారు…గురుకులాల్లో ఎం జరుగుతుందో తెలుసుకొని పరిస్థితులు చక్కదిద్ది చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది…