సాంఘీక సంక్షేమ శాఖ గురుకులాలు, ఎం.జె పి ల్లో “సోమశేఖర” మాయ కొనసాగుతుంది…ప్రొవిజేన్స్ సరఫరా చేసే కాంట్రాక్టుల్లో అతగాడి హవా కొనసాగుతుంది….సాంఘీక సంక్షేమ గురుకులాల్లో ఓ 8 కి పైగా అలాగే ఎం జె పి ల్లో ఉమ్మడి జిల్లా మొత్తం సోమశేఖర టెండర్లు దక్కించుకుని తన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి….బ్రాండింగ్ ఉన్న కవర్లల్లో నకిలీ సరుకులు ప్యాక్ చేసి గురుకులాలకు సరఫరా చేస్తూ బాగానే వెనకేసినట్లు విశ్వసనీయ సమాచారం….. గురుకులాల్లో టెండర్ వేసే వ్యక్తులు ఆయా కెటగిరీల్లో ఒకటి లేదా రెండు టెండర్ లు మాత్రమే వేయాలని తెలుస్తున్న ఈ “సోమశేఖర” మాత్రం పదుల సంఖ్యలో టెండర్లు ఎలా వేస్తున్నాడో అర్థంకాని విషయం….
ఇదేం మాయ….?
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 8 కి పైగా , వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని ఎం జె పి ల్లో ప్రొవిజేన్స్ సరఫరా కాంట్రాక్టు మొత్తం “సోమశేఖర” దక్కించుకున్నాడు…. దక్కించుకోవడం అంటే ఓ ఏడాది మరో ఏడాదో కాదు ఏకంగా దశాబ్ద కాలం పైగా ఈ ఒకే ఒక్కడు ప్రొవిజేన్స్ సరఫరా కాంట్రాక్టుల్లో రాజ్యం ఎలుతున్నాడంటే ఇతగాడి వెనకాల ఇంతలా ఎవరి ప్రోత్సాహం ఉందో గురుకులాల అధికారులకే తెలియాలి…అంతే కాదు ఇన్ని ఏళ్లుగా ఈ కేటగిరీలో సోమశేఖరే టెండర్ వేసి కాంట్రాక్ట్ ఎలా దక్కించుకోగలుగుతున్నాడో…గురుకులాల అధికారులు ఆ రహస్యాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది….నిత్యావసరాల సరఫరాలో నాణ్యత ఎలా ఉంది…. నకిలీ వస్తువులు సరఫరా చేస్తుంటే అధికారులు ఎం చర్యలు తీసుకుంటున్నారో… అసలు ఈ ప్రొవిజేన్స్ ఎలా తనిఖీ చేస్తున్నారో వారు సమాధానం చెప్పాలి….కాగా ప్రొవిజేన్స్ సరఫరాల కాంట్రాక్ట్ విషయంలో “సోమశేఖర” గుత్తాదిపత్యం కొనసాగేలా కొందరు అధికారులు బాగానే సహకరిస్తున్నారని….సరుకుల సరఫరా ఎలా ఉన్నా ,వరంగల్,జఫర్ గడ్ ప్రాంతాల్లో గోడౌన్ లు ఏర్పాటు చేసి వీటిలో సంవత్సరాల కొద్దీ సరుకులు నిల్వచేసి అవే నాణ్యత లేని సరుకులను గురుకులాల కు సరఫరా చేసి ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాడని ఆరోపణలు వస్తున్న ఇప్పటివరకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది….అంతేకాదు ఈ కాంట్రాక్టర్ సైతం గురుకులాలకు ప్రొవిజేన్స్ సరఫరా విషయంలో తాను ఆడింది ఆటగా,పాడింది పాటగా నడుస్తుందని,నకిలీ సరుకులు సరఫరా చేసిన వాటిని గుర్తించేవారు ఎవరు…అసలు ఎలా గుర్తిస్తారు….?ఎన్ని ఆరోపణలు వచ్చిన మీడియాలో కథనాలు వచ్చిన తనను ఎవరూ ఎం చేయలేరనే మేకపోతు గాంభీర్యానికి కారణం అతగాడికి కొందరు అధికారులు అందిస్తున్న అండదండలే కారణమని తెలుస్తోంది….మళ్లీ టెండర్లు దాఖలు చేసే సమయం వస్తున్న తరుణంలో అధికారులు ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో చూడాలి……