గుడి పేరుతో తన భూమిని కొందరు కబ్జా చేయాలని చేస్తున్నారని కొందరు దళితులు ఆరోపిస్తున్నారు… తమకు ఇంటి నిర్మాణం కోసం 2010 సంవత్సరం లో అప్పటి సర్కార్ కేటాయించిన భూమిలో ఎంతగా చెప్పిన వినకుండా గుడి పేరుతో తమ భూమిని కబ్జా చేస్తున్నారని వారు ఆరోపించారు… హన్మకొండ జూపార్కు ఎదురుగా ఉన్న దీన్ దయాల్ నగర్ లోని సర్వే నంబర్ 967,966 లో గల భూమిలో ఉన్న ప్రాంతం లో గతంలోనే తాము షెడ్డు వేసుకుంటే ఆ షెడ్డును తొలగించివేసి ఆ షెడ్డు లోని ఐరన్ రాడ్లకు కాశయం జెండాలు కట్టి నామాలు పెట్టి అదే ప్రాంతంలో దేవుడి విగ్రహం పెట్టి తమ భూమిని కబ్జాచేసే ప్రయత్నం చేస్తున్నారని పట్టాదారు కొండ్ర సాంబయ్య ఆరోపించారు….తమ షెడ్డును తొలగించడమే కాకుండా అక్కడ గుడి నిర్మిస్తామని తమను బెదిరిస్తున్నారని అన్నారు…తనతో పాటు ఓ 12 మంది దళితులకు ప్రభుత్వం భూమిని కేటాయిచారని చెప్పిన వినకుండా గుడి పేరుతో భూమిని పూర్తిగా కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని అన్నారు…భూమి తమదని చెప్పిన వినకుండా ఇదేంటని ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు….తమ భూమికి ఎంతో దూరంలో ఉన్న శ్రీరాం కాలని చెందిన కొందరు కావాలనే గుడి పేరుతో తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు…తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్న వారిపై కేసు నమోదు చేయాలని తమ భూమిని కబ్జా కాకుండా కాపాడాలని కొండ్ర సాంబయ్య అధికారులను వేడుకున్నాడు….