గజ్జి విష్ణు దారెటు?

ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వివిధ నియోజకవర్గాల్లో అసమ్మతుల తలనొప్పి ఎక్కువై పోతుంది…టికెట్ ఆశించిన వారు కొందరైతే, కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ లకు టికెట్ రావడాన్ని వ్యతిరేకిస్తున్న వారు మరికొందరు ఇలా వ్యతిరేకించిన వారు కొందరు రెబల్ గా కూడా నామినేషన్ వేయడానికి సిద్ధం ఐయ్యారు… పరకాల నియోజకవర్గంలో బి ఆర్ ఎస్ యువనాయకుడు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గజ్జి విష్ణు ఇప్పటికే నామినేషన్ వేశారు…పరకాల నియోజకవర్గంలో పేరు,యూత్ లో పాలోయింగ్ ఉన్న గజ్జి విష్ణు గులాబీ రెబల్ అబ్యర్థిగా ఇలాగే పోటీలో కొనసాగితే సిట్టింగ్ ఎమ్మెల్యే ,బి ఆర్ ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి కి ఎన్నికల్లో నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది… గజ్జి విష్ణు ఇలాగే బరిలో కొనసాగితే ఎంతలేదన్న దాదాపు ఇరవై వేల ఓట్ల వరకు బి ఆర్ ఎస్ కు గండి పడనున్నట్లు తెలుస్తుంది…

విష్ణు దారెటు….?

మరోవైపు పరకాల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే రెబల్ అబ్యర్థిగా గులాబీ పార్టీ నుంచి నామినేషన్ వేసిన గజ్జి విష్ణు దారేటనే అంశంపై నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది… రెబల్ అబ్యర్థిగా పరకాల ఎమ్మెల్యే బరిలో గజ్జి విష్ణు అలాగే నిలుస్తాడని అతని అనుచరులు అంటున్నారు…మరోవైపు గజ్జి విష్ణును తమ పార్టీలోకి ఆహ్వానించడానికి కాంగ్రెస్ బాగానే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది…ఓ వైపు బి ఆర్ ఎస్ నాయకులు సైతం విష్ణు తో చర్చలు జరుపుతు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది….ఈ బుజ్జగింపులు, ఈ ప్రయత్నాల నేపథ్యంలో పార్టీ మారాలంటూ అనుచరుల నుంచి విష్ణుకు తన అనుచరుల నుంచి ఒత్తిడి వస్తున్నట్లు సమాచారం…నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం ఐయి ఎన్నికలు దగ్గరపడుతుండగా ఈ విషయంలో విష్ణు ఏదోఒకటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది…. దింతో విష్ణు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారనే అంశం ఆసక్తికరంగా మారింది….విష్ణు ఏ పార్టీ లో చేరకుండా ,బుజ్జగింపులకు లొంగకుండా విష్ణు గులాబీ రెబల్ అబ్యర్థిగా అలాగే బరిలో నిలిస్తే ఏ పార్టీ కి నష్టం,ఏ పార్టీకి లాభం అనే చర్చ పరకాల నియోజకవర్గంలో కొనసాగుతుండగా ఇలాగే బరిలో నిలిస్తే గులాబీ అభ్యర్థికే తీవ్ర నష్టమని గులాబీలోనే చర్చ జరుగుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here