ఫార్ములా-ఈ కార్ రేస్ పై ఏసీబీ కేసు నమోదు చేసినట్లు తెలిసింది..ఈ కేసు మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పై నమోదయింది….
మాజీ మంత్రి బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఎసిబి కేసు నమోదు చేసింది…ఈ కార్ రేస్ విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణల నేపద్యంలో అతడిపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి ఏసీబీ కి లేఖ రాయగా గురువారం కేటీఆర్ పై ఏసిబి కేసు నమోదు చేసింది….
కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు ,ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం పై
ఆయనపై 4 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది…
13 (1) A, 13 (2) పీసీ యాక్ట్, 409, 120B కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం…కాగా గత కొద్ది నెలలుగా కేటీఆర్ జైలు కు వెళ్తాడని అధికార పక్ష నాయకులు అంటుండగా,జైలు కు దమ్ముంటే పంపించు అని కేటీఆర్ సవాల్ తో అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగగా రాజకీయ వర్గాల్లో ఓ చర్చకు దారి తీసింది …ఈ నేపద్యంలో కేటీఆర్ పై ఏసిబి కేసు నమోదు చేయడం రాజకీయ వర్గాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందని ఓ టెన్షన్ వాతావరణం నెలకొంది…కాగా కేటీఆర్ పై కేసు నమోదు కాగా ఏ క్షణమైనా ఆయనను అరెస్టు చేయవచ్చని తెలుస్తుంది….