హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపూర్ గ్రామ పరిధిలో ఉన్న యాక్ గ్రానైట్ క్వారీ యాజమాన్యం మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేస్తున్నప్పటికీ సంబంధిత మైనింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పరోక్షంగా యాజమాన్యానికి సహకరిస్తున్నారనే ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి.ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్(ఈ సి)లేకుండా తవ్వకాలు చేస్తున్న ఆ గ్రానైట్ క్వారీ పై హన్మకొండ జిల్లా కలెక్టర్ ఏనిర్ణయం తీసుకుంటారో అనే చర్చ ఇటు మైనింగ్ శాఖలో, అటు గ్రానైట్ క్వారీల యజమానులలో జోరుగా సాగుతున్నట్టు సమాచారం.ప్రభుత్వ నిబంధనలు తుంగలోతొక్కి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్(ఈ సి)లేకుండా తవ్వకాలు చేస్తున్న యాక్ గ్రానైట్ క్వారీపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు ఆ గ్రానైట్ క్వారీని మూసివేయాలని పలువురు పర్యావరణ ప్రేమికులు భావిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా “ఈ సి” లేకుండా నడుస్తున్న యాక్ గ్రానైట్ క్వారీని జిల్లా కలెక్టర్ సీజ్ చేస్తారా? లేదా? అనేది త్వరలోనే తేలిపోనుంది.