కటాక్షపురం చెరువుకు కబ్జా ముప్పు…..?

హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపురం చెరువుకు ఇప్పుడు కబ్జా ముప్పు మొదలయ్యింది…ఎంతోమంది అన్నదాతలకు ఆదరువుగా ఉన్న చెరువును ఓ ఇద్దరు బడాబాబులు తమ ఇష్టం ఉన్నట్లు కబ్జా చేస్తున్నట్లు తెలుస్తోంది…. జాతీయ రహదారిని ,చెరువును ఆనుకుని స్థలాన్ని కొనుగోలు చేసిన ఈ ఇద్దరు బడాబాబులు ఒక అంకెలో భూమిని కొనుగోలు చేసి ఇప్పుడు కబ్జా పుణ్యాన వీరు రెండంకెల స్థాయి కి చెరువు భూమిని తమ ఆధీనంలోకి తెచుకున్నట్లు సమాచారం….

డాక్టర్ ,తహశీల్దార్ తనయుడు…?

కటాక్షపూర్ చెరువును ఓ ఇద్దరు బడాబాబులు రెండుదిక్కుల కబ్జా చేస్తున్నట్లు తెలుస్తోంది…వరంగల్ ఎంజీఎం లో ఆర్ ఎం ఓ గా విధులు నిర్వహించి రిటైర్డ్ అయిన ఓ వైద్యుడు,ఓ విదేశంలో ఉంటున్న తహశీల్దార్ తనయుడు ఈ చెరువు కబ్జాకు పాల్పడుతున్నట్లు చెరువును పరిశీలిస్తే అర్థం అవుతుంది….ఈ ఇద్దరు తాము కొనుగోలు చేసిన భూమి చెరువును ఆనుకొని ఉండడంతో వీరికి మరింతగా కలిసి వచ్చింది…ప్రతి ఏటా కొంత చెరువులోకి తమ పెన్షింగ్ ను జరుపుతూ ఎకరాల కొద్దీ భూమిని తమ ఖాతాలో చేర్చుకుంటున్నారట….చెరువులోని మట్టిని తవ్వుతూ చదును చేస్తూ తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నట్లు కొందరు గ్రామస్తులు న్యూస్10 కు తెలిపారు….ఈ చెరువు కబ్జా తోనే వారి భూమి ఎకరాలకు ఎగబాకినట్లు స్థానికులు అంటున్నారు. .చెరువు శిఖం భూమిని చదును చేసి ఓ బడబాబు వరి పంట సాగుచేస్తుండగా…మరో బడాబాబు చెరువు శిఖం భూమిలోనే మూడంతస్తుల భవనం నిర్మిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం…. రాత్రిపూట చెరువు శిఖం భూమిని జె సి బి లతో అడ్డగోలుగా తవ్వుతూ కబ్జా కు తెరతీసారట…

జాడలేని రెవెన్యూ అధికారులు…

కటాక్షపురం చెరువులో అడ్డగోలుగా తవ్వకాలు జరుపుతూ చెరువు మట్టి తోనే చెరువును పూడ్చుతూ అక్రమంగా చెరువు కబ్జాకు పాల్పడుతున్న రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు వినపడుతున్నాయి…గతంలో ఇలాగే చెరువు కబ్జా జరిగితే సర్వే జరిపి హద్దులు పెడతామని చెప్పిన రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులు ఇప్పటికి ఆ పని చేయకపోవడంతో చెరువు మూడు వైపుల ఎవరికి తోచినంత వారు కబ్జా చేస్తున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు…ఇకనైనా రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులు ఈ బడాబాబుల చెరువు కబ్జా విషయంలో స్పందిస్తారా ..లేదా చూడాలి…

చెరువు కబ్జా వెనుక ఎవరు….?
ఆ గ్రామ సర్పంచ్ పాత్ర ఎంత….?
అధికారులు చూసిచూడనట్లు ఎందుకు వదిలేస్తున్నారు…?

మరో సంచికలో…….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here