భూపాలపల్లి నియోజకవర్గం రాజకీయాల్లో ఓ భారీ కుదుపు రాబోతుందా….టి ఆర్ ఎస్ పార్టీ ఏర్పాటునుంచి కొనసాగుతూ తెలంగాణ శాసనసభ తొలి స్పీకర్ గా ఉన్న సిరికొండ మధుసూదనాచారి తనయుడు సిరికొండ ప్రశాంత్ ఆ కుదుపు కు కారణం కాబోతున్నార…?అంటే అవుననే సమాధానమే వస్తుంది…తన తండ్రి కి ఈసారి భూపాలపల్లి టికెట్ వస్తుందని బలంగా విశ్వసించిన ప్రశాంత్ ఆ టికెట్ గండ్రకు దక్కడంతో రగిలిపోతున్నట్లు సిరికొండ అనుచరులు అంటున్నారు… ఇదే విషయాన్ని న్యూస్10 రెండురోజుల క్రితం తన కథనంలో స్ఫష్టం చేసింది… సిరికొండ మధుసూదనాచారి తనయుడు ప్రశాంత్ భూపాలపల్లి బరిలో ఉంటారని చెప్పింది… ఇప్పుడు న్యూస్10 చెప్పిందే నిజం కాబోతోంది….రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో చారి తనయుడు బరిలో నిలువబోతున్నాడు…
ఏనుగెక్కుతాడా…..?
భూపాలపల్లి బరిలో నిలిచిన ఓ రావుకు ఇంకో రెడ్డి కి చెక్ పెట్టేందుకు బిసి గా బహుజననినాదంతో ఎన్నికల బరిలో నిలవాలని సిరికొండ ప్రశాంత్ నిర్ణయించుకున్నట్లు తెలిసింది… ఈ మేరకు ఆయన ఓ వీడియోను సైతం విడుదల చేసారు .. ఈ వీడియోలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తనయుడికి గట్టి వార్నింగ్ సైతం ఇచ్చాడు ప్రశాంత్….ఐయితే వీరిద్దరికి గట్టిపోటీ ఇచ్చి విజయం సాదించేందుకు ప్రశాంత్ బి ఎస్ పి లో చేరేందుకు సిద్ధపడ్డట్లు తెలుస్తుంది…ఇప్పటికే ఆయన బి ఎస్ పి పెద్దలను సంప్రదించి హామీ సైతం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది…. ఏనుగు గుర్తుపై పోటీచేసి సంచలనం సృష్టించి భూపాలపల్లి లో సిరికొండకు ఎదురులేదని నిరూపించడానికి ప్రశాంత్ బహుజన బలాన్ని కూడగట్టుకుంటున్నట్లు తెలిసింది…అంతేకాదు ఒకవేళ బి ఎస్ పి నో చెప్పిన పోటీలో ఉండడం ఖాయమని బి ఆర్ ఎస్ రెబల్ అభ్యర్థి ఉండేందుకైనా ప్రశాంత్ సిద్ధపడ్డట్లు సమాచారం…మొత్తానికి భూపాలపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకో మలుపు తిరుగుతున్నాయి….సిరికొండ ప్రశాంత్ ఇక్కడనుంచి పోటీలో దిగితే ఇద్దరు గండ్రలు ఓ సిరికొండ మధ్య గట్టి పోటే ఉండబోతోందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి….