ఎస్సారెస్పీ భూమికే ఎసరు…..?

కాదేదీ కబ్జాకు అనర్హం అన్నట్లు తయారైయింది కొంతమంది అక్రమార్కుల వక్రబుద్ది…సర్కార్ భూమి ఐయితే ఈజీగా వర్కౌట్ అవుతుంది అనుకున్నాడో ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఎస్ ఆర్ ఎస్ పి కెనాల్ భూమికే గురి పెట్టాడు…తనకున్న రాజకీయ పలుకుబడితో ఆ భూమిని కబ్జా చేసి తన భూమి అనిపించుకునే పనిలో బాగా బిజీగా మారిపోయాడు…. ఎస్ ఆర్ ఎస్ పి కాలువను ఆనుకొని ఉన్న భూమిని తన సొంతం చేసుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ తనకున్న పరిచయాలను వాడుతూ తనకున్న కబ్జా ఆలోచనను అమలు చేస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి..

ఇది కబ్జా కథ….

సంగెం మండలం. తిగరాజుపల్లి గ్రామంలో క ఎస్సార్ ఎస్పీ కెనాల్ భూమి కబ్జాకు గురవుతుంది.. వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామం లోని ఎస్సార్ ఎస్పీ కెనాల్ భూమి దాదాపు 2 ఎకరాల భూమి ఖబ్జాకు రాజకీయ పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి యత్నిస్తున్నాడు.. సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలో కెనాల్ పక్కకు ఉన్న ఎస్సార్ ఎస్పీ భూమిని రాజకీయ పలుకుబడి ఉన్న ఓ వ్యక్తి భూమిని దాదాపు కబ్జా చేసేశాడు…ఈభూమిని ఉమ్మడి రాష్టంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా ఉన్నపుడు కార్తీక వనం క్రింద ఈభూమిలో చెట్లను నాటడం జరిగింది.ఈ చెట్లకు వాచర్లుగా ఇద్దరు వ్యక్తులను కూడా నియమించడం జరిగింది.4నుండి 5 సంవత్సరాలు వరకు రోజుకు 50 నుండి 60 మంది వరకు కూలీలతో చెట్లసంరక్షణ, వాటికి నీరు,కలుపు వంటి పనుల కోసం పని చేసేవారు.ఇలా 20నుంచి25 సంవత్సరాల క్రితం నాటిన మొక్కలు ఇప్పుడు భారీ వృక్షాలుగా ఎదిగాయి… ఈ వృక్షాలను సైతం కెనాల్ కబ్జా చేయడానికి క్రమ క్రమంగా వాటిని నరికి వేస్తూ చెట్లను సైతం అమ్మి ఆ కబ్జా దారుడుసొమ్ము చేసుకున్నట్లు సమాచారం …ఎస్ ఆర్ ఎస్ పి కెనాల్ స్థలాన్ని కబ్జాకు ఓ స్థానిక ప్రజా ప్రతినిధి జె సి బి తో చదును చేపిస్తే మరో స్థానిక ప్రజాప్రతినిది కబ్జాకు సహకరిస్తున్నడని స్థానికులు అంటున్నారు.సర్కారుకు చెందిన ఎస్ ఆర్ ఎస్ పి భూమి కబ్జాకు యత్నిస్తున్న రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… ఇంత పెద్ద ఎత్తున భూ ఖబ్జా జరుగుతున్న గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టింపులేనట్లు ప్రవర్తిస్తున్నారు.. కాగా అధికారులు సైతం పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తుల ఆరోపిస్తున్నారు…
ఇప్పటికైన రెవిన్యూ అధికారులు ,ఇరిగేషన్ అధికారులు కబ్జాక జరుగుతున్న స్థలాన్ని పరిశీలించి కబ్జా నుంచి భూమిని కాపాడి కబ్జా ధారులపైచర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here