హన్మకొండ జిల్లా రాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న పార బాయిల్డ్ రైస్ మిల్లులు కాలుష్య కారకాలు అవుతున్న అధికారులకు ఏమాత్రం పట్టింపు లేకుండా పోయింది…ఏజెంట్ మధ్యవర్తిత్వంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆ మిల్లులను చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ఆరోపణలు వస్తుండగా….ఈ పార బాయిల్డ్ మిల్లులకు అతి సమీపంలో ఉన్న ఎస్సారెస్పీ కెనాల్ లోకి మిల్లులు కలుషిత జలాలను వదులుతున్న ఎస్సారెస్పీ అధికారులకు కనీస సోయి లేకుండా పోయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి… పంటపొలాల కు నీరందించే ఎస్సారెస్పీ కాలువులోకి మిల్లు యజమానులు కలుషిత జలాలను వదులుతున్న కనీసం.ఇదేంటని ఎస్సారెస్పీ అధికారులు ఇప్పటికి వారిని ప్రశ్నించకపోవడం,వారిపై చర్యలు తీసుకోక పోవడం ఎస్సారెస్పీ అధికారుల నిర్లక్ష్యానికి అద్ధం పడుతుంది…. కాగా తాము మిల్లులు నడుపుతున్నాం తమను అనేవారు ఎవరనే ధోరణిలో మిల్లు యజమానులు సైతం ఉన్నట్లు తెలుస్తుంది… పైరవీలతో ఏదైనా చేయవచ్చనే పనికిమాలిన ధీమాతో మిల్లు యజమానులు అటు కాలుష్య నియంత్రణ మండలి అధికారులను,ఇటు ఎస్సారెస్పీ అధికారులను లెక్కచేయని తనంతో ఉన్నారని తెలుస్తుంది….మరోవైపు రాంపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో కాలుష్యాన్ని వెదజల్లుతున్న పార బాయిల్డ్ మిల్లులపై చర్యలు తీసుకోవడానికి ,సక్రమంగా తనిఖీలు చేయడానికి ,ఉన్నతాధికారులకు ఉన్నది ఉన్నట్టు నివేదిక పంపడానికి కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఏమాత్రం మనసు రావడం లేదని అనిపిస్తుంది…. సమస్య ఓ దగ్గర ఉంటే ఓ దగ్గర ఫోటోలు తీసి తనిఖిని మమ అనిపించినట్లు న్యూస్10 పరిశీలనలో వెల్లడయింది… కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తాము తీసిన ఫోటోలను చూపించడానికి సైతం వెనుకాడడం పలు అనుమానాలకు తావిస్తోంది…. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ,జిల్లా ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారిస్తే నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది…. ఈ తనిఖీలపై, పార బాయిల్డ్ రైస్ మిల్లుల వ్యవహారంపై ఎలా స్పందిస్తారో చూడాలి
తనిఖీలు చేశాం..
ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపిస్తాం…
సునీత ,ఈ ఈ, కాలుష్య నియంత్రణ మండలి
న్యూస్-10 లో వస్తున్న కథనాల ఆధారంగా పారాబాయిల్డ్ రైస్ మిల్లుల్లో తనిఖీలు చేపట్టాలని మా ఏ ఈ ని ఆదేశించడం జరిగింది.గత నాలుగు రోజుల క్రితం మా ఏ ఈ క్షేత్రస్థాయిలో మిల్లులను పరిశీలించారు ఆ మిల్లులపై రిపోర్ట్ తయారు చేస్తున్నాము మరో నాలుగు రోజుల్లో ఉన్నతాధికారులకు చర్యల నిమిత్తం రిపోర్ట్ పంపిస్తాం . అక్కడ ఉన్న కెనాల్ లో ఆ మిల్లుల నుండి వచ్చే వ్యర్ధపు నీరు ఎలా కలుస్తుందో దాని వల్ల ఏ మేర పొల్యూషన్ జరుగుతుందని ఆ నీటి యొక్క శాంపిల్ ని సేకరించి ల్యాబ్ కు కూడా పంపించడం జరిగింది.ల్యాబ్ నుండి రిపోర్ట్ రావడానికి సుమారు 15 రోజుల సమయం పడుతుంది.