కాంగ్రెస్ లో సీఎం ఎవరనే విషయంలో పడిన పీఠముడి ఇంకా వీడలేదు….మెజార్టీ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పిన… ఉత్తమ్ కుమార్ రెడ్డి,భట్టి విక్రమార్క ఇంకా ఆశలు వదులుకొనట్లు కనపడుతుంది… ఇప్పటికే ఢిల్లీ కి చేరుకున్న వీరిరువురు కాంగ్రెస్ అగ్ర నాయకులను కలిసే ప్రయత్నం చేస్తున్నారు …కాగా సాయంత్రం కల్లా తెలంగాణ సీఎం ఎవరనే విషయాన్ని ప్రకటిస్తామని మల్లిఖార్జున ఖర్గే మీడియాతో చెప్పి పార్లమెంట్ సమావేశానికి వెళ్లారు….ఐయితే ఢిల్లీ చేరుకున్న ఉత్తమ్ అక్కడ కర్ణాటక డిప్యూటీ సీఎం డి కే శివకుమార్ తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది… తాను కాంగ్రెస్ కు కష్టకాలంలో అండగా ఉంటూ పి సి సి అధ్యక్షుడిగా కొనసాగి పార్టీనే పట్టుకొని ఉన్నానని తనకే సీఎం పదవి ఇవ్వాలని ,ఇస్తారని ఉత్తమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది….ఇదిలావుండగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ఎం పి పడవికి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది… పార్లమెంట్ స్పీకర్ కు తన రాజీనామా లేఖను ఉత్తమ్ సమర్పించనున్నట్లు తెలిసింది…మొత్తానికి సీఎం పదవి కోసం ఉత్తమ్, భట్టి లు బాగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు కనపడుతుంది….