ఉత్తర తెలంగాణకు తలమానికమైన ఎంజీఎం పెద్ద ఆసుపత్రిలో ఎవరి ఇష్టారాజ్యం వారిదిగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి… ఎంజీఎం లో డైటీషన్ గా కొనసాగుతున్న ఓ అధికారి విధులను ఏమాత్రం నిర్వర్తించకుండా కేవలం కొంతమంది అధికారుల ఛాంబర్ లకు పరిమితం అవుతున్నట్టు తెలుస్తోంది.. ఎంజీఎం లో వైద్యం కోసం చేరిన రోగులకు కనీసం డైట్ విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వకుండా విధులను మరిచి ఆ అధికారి ప్రవర్తిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.. సుమారు 2012 నుంచి ఇక్కడ ఓపి విధులు నిర్వర్తించట్లేదని తెలిసింది.. దీంతో పేదల పెద్ద ఆసుపత్రిలో అసలు డైటీషియన్ ఉన్నట్ల లేనట్లా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. ఎంజీఎంలో డైటీషియన్ వ్యవహార శైలిపై న్యూస్ 10 కథనం సాయంత్రం సంచికలో….