ఎంజీఎం లో శునకాల విహారం

ఉత్తరతెలంగాణకు గుండె కాయలా ఉన్న పెద్దాసుపత్రి ఎంజిఎం లో పాలన పూర్తిగా గాడి తప్పినట్లు కనపడుతుంది… ఇప్పటివరకు అసలు ఎంజిఎం కు సూపరింటెండెంట్ ఎవరో తెలియని పరిస్థితి కొనసాగుతుండగా మొన్నటివరకు కొనసాగిన సూపరింటెండెంట్ తన పదవికి రాజీనామా చేసిన పరిస్థితి చోటుచేసుకోగ… ఎంజియం ఆసుపత్రిలో ఎవరి ఇష్టారాజ్యం వారిదిగా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది….ఇక్కడ పరిశుభ్రత పూర్తిగా పడకేసినట్లు కనపడుతుంది…మెడికల్ బయో వ్యర్థాలను ఆసుపత్రి సిబ్బంది ఆసుపత్రి పరిసరాల్లోనే బహిరంగంగా బయట పడబోస్తుండగా తాజాగా ఎంజిఎం లో శునకాలు స్వేచ్ఛగా విహరిస్తున్నాయి….ఆసుపత్రిలోని వార్డుల్లో, ఐ సి యూ వార్డుల్లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్న పట్టించుకున్న వారే లేకుండా పోయారు….రోగులు,రోగుల బంధువులతో పాటు ఎంజిఎం వార్డుల్లో కుక్కలు తిరగడం కనపడింది… వార్డుల్లో తిరుగుతున్న కుక్కలు సెక్యూరిటీ గార్డులను తప్పించుకొని ఎలా లోపలికి ప్రవేశించాయో వారికే తెలియాలి…రోగుల బందువులను పరామర్శ కోసం వార్డుల్లోకి పంపడానికి సవాలక్ష నిబంధనలతో అడ్డుకునే సెక్యూరిటీ గార్డులు ఎంజీఎం వార్డుల్లోకి శునకాలను ఎలా వదిలి పెడుతున్నారని రోగుల బంధువులు ప్రశ్నిస్తున్నారు…

కళ్ళు మూసుకున్న అధికారులు….


ఎంజిఎం వార్డుల్లోకి కుక్కలు ప్రవేశించి ఐ సి యు తో సహా వార్డుల్లో కలియ తిరుగుతున్న ఎంజిఎం అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి… రోగులు ,రోగుల బంధువులు, వైద్యుల మద్యే కుక్కలు తిరుగుతున్న అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం ఎందుకో వారికే తెలియాలి…తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తూ ఎంజిఎం శుభ్రతను అధికారులు గాలికొదిలేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…. అంతేకాదు ఎంజిఎం శుభ్రత,సెక్యూరిటీ గార్డు కాంట్రాక్టు నిర్వహిస్తున్న సదరు సంస్థ ఎలా స్పందిస్తుంది… ఆ సంస్థ పై అధికారులు ఏ చర్యలు తీసుకుంటారు…ఎంజిఎం లో శునకాల విహారానికి అధికారులు ఎలా చెక్ పెడతారో వేచిచూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here