ఆ గ్రామానికి వ్రిద్ది కంపెనీ తో తంటా మొదలయిందట… మొన్నటివరకు అనుమతులు లేకుండా ఆ ఊరి చెరువులో మట్టి తవ్వి అధికారులు తవ్వకానికి బ్రేకులు వేయడంతో అక్కడనుంచి వేరేదగ్గర తవ్వకాలు మొదలుపెట్టిన ఈ వ్రిద్ది కంపని తో హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం హౌజ్ బూజుర్గ్ గ్రామ ప్రజలకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చిపడిందట… జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఈ ఊరు ను ఇప్పుడు కాలుష్యం బయపెడుతుందట… ఈ కాలుష్యానికి కారణం వృద్ధి కంపనియేనని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు….
ప్లాంటు తిప్పలు….?
హౌజ్ బుజుర్గ్ గ్రామ ప్రజలు వ్రిద్ది కంపెనీ ఇటీవల ఏర్పాటు చేసిన డాంబర్ ప్లాంట్ మూలంగా అనేక తిప్పలు పడుతున్నట్లు తెలిసింది…జాతీయ రహదారిని ఆనుకొని ఏర్పాటు చేసిన ఈ డాంబర్ ప్లాంటు వల్ల గ్రామస్తులకు కొత్త తిప్పలు వచ్చిపడ్డాయని అంటున్నారు….సాయంత్రం ఐయిందంటే చాలు డాంబర్ ప్లాంట్ మూలంగా వస్తున్న కాలుష్యపు పొగ వల్ల గ్రామం మొత్తం పొగమయం అయిపోతు గ్రామం మొత్తం పొగ కమ్ముకుపోవడం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారట…అంతేకాదు ఈ డాంబర్ ప్లాంట్ నడిచేటప్పుడు వెలువడుతున్న పొగవల్ల జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులకు సైతం ఇబ్బందులు కలుగుతున్నాయట…పగటి వేళల్లో సైతం ఈ డాంబర్ ప్లాంట్ నడిస్తే ఇక్కడి జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు లైట్లు వేసుకొని మరి ప్రయాణం చేయాల్సి వస్తుందట….
అధికారులు ఎక్కడ….?
అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉందని వృద్ధి కంపెనీ డాంబర్ ప్లాంట్ కు అధికారులు అనుమతి ఇచ్చారో… లేక పెద్ద రహాదారి నిర్మిస్తున్న కంపెనీ అసలే సర్కార్ పని అని చూసిచూడనట్లు డాంబర్ ప్లాంట్ కు అధికారులు అనుమతులు ఇచ్చారో తెలియదు కాని పెద్ద కంపెనీ కావడం వల్లే కాలుష్యం ఎంత వచ్చిన అధికారులు కళ్ళు మూసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి…ఈ వ్యవహారాన్ని గమనించి కాలుష్య తీవ్రతను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిన కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సైతం డాంబర్ ప్లాంట్ విషయంలో ఎలా అనుమతులు ఇచ్చారో వారికే తెలియాలి …సమీపంలోనే ఓ గ్రామం ,జాతీయ రహదారిని ఆనుకొని డాంబర్ ప్లాంట్ ఉన్న అనుమతులు ఎలా సాధ్యం ఐయాయో దాని వెనకాల ఉన్న మతలబు ఏంటో…. ఆ అధికారులకే తెలియాలి …ఈ డాంబర్ ప్లాంట్ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు జాడ లేకపోవడం పలు విమర్శలకు దారితీస్తుంది…. తాము ఏర్పాటు చేసిన డాంబర్ ప్లాంటు తో కాలుష్యం వేదజల్లుతూ గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్రిద్ది కంపెనీ మాత్రం తమకేం పట్టనట్లు వ్యవహరించడం ఏంటని…గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు…కంపెనీ తీరుపై డాంబర్ ప్లాంట్ మూలంగా వస్తున్న పొగ వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఇప్పటికే గ్రామానికి చెందిన కొంతమంది యువకులు హన్మకొండ జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేసారు…చూడాలి మరి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు , జిల్లా కలెక్టర్ ఈ డాంబర్ ప్లాంట్ విషయంలో ఎలా స్పందిస్తారో…
కాంట్రాక్టే ముఖ్యం…ప్రజలతో ఏంపని…?
మరో సంచికలో…..