తాను సెటిల్ మెంట్లకు పాల్పడినట్లుగా నిరూపిస్తే ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతానని యం.పి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వరంగల్ పోలీస్ కమిషనర్, సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ పై బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ఈ మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ తనను లక్ష్యంగా చేసుకోని బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేసారు. తనపై ఇంతకాలం ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేయలేదు. గతంలో నల్గొండ, ఖమ్మంతో పాటు ప్రస్తుతంలో వరంగల్ కూడ బిజేపి, బిఆర్ఎస్, కాంగ్రేస్ పార్టీకి చెందిన ఎంతో మంది నాయకులను అరెస్ట్ అయ్యారు. అప్పుడు చేయనటువంటి ఆరోపణలు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు. బండి సంజయ్ అరెస్ట్ అయినందుకు నాపై ఉక్రోషంతో ఆరోపణలు చేసినట్లు వుందని. తాను పనిచేసిన ప్రాంతాల్లోని ప్రజలు తనను ఇప్పటికి గుర్తుపెట్టుకోని ఆత్మీయంగా పలకరిస్తారని. తాను రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేస్తానని, రేపు పోలీస్ కమిషనరేట్ నిర్వహించే ప్రజావాణిలో నాదగ్గరికి ఎవరోస్తారో మీరే స్వయంగా వచ్చి చూడాలని. తన వద్దకు దళారులు రారని, కేవలం సామాన్యులు, న్యాయం కోసం నలిగిపోయినవారే వస్తారని. తన వల్ల కేసుల పాలైన రౌడీలు, భూకబ్జాదారులు, పీ.డి యాక్ట్ బాధితులు, ఇతర నేరాలకు పాల్పడిన వారు ఉండవచ్చు వారు తన బాధితులుగా యం.పి బండి సంజయ్ కుమార్ ను కలిసి వుంటారని. తనపై చేసిన ఆరోపణలకు నవ్వాలో ఏడ్వాలో అర్ధం కావడంలేదన్నారు, ఇక విజయవాడ ఆయేషా కేసు విషయానికి వస్తే ఈ కేసుపై బండి సంజయ్ కి పూర్తి అవగాహన లేదని, ఆకేసు చేసింది తాను కాదని పోలీస్ కమిషనర్ తెలియజేసారు. తాను ప్రమాణం చేసే ఉద్యోగంలో చేరాను కచ్చితంగా చేయాలంటే ప్రమాణం చేస్తాను. నా వృత్తి ధర్మాన్ని ప్రజలు విశ్వసించారు కాబట్టే పాలభిషేకాలు చేశారని, బెదిరించి. కేసును పక్కదారి పెట్టాలని చూడడం కోసం పోలీస్ కమిషనర్ స్థాయి అధికారిపై ఆరోపణలు చేయడం సరికాదని, విచారణ అధికారిని జాగ్రత్త అని హెచ్చరించడమంటే బెదిరింపులకు పాల్పడడం అవుతుందని. కోర్టుకు అన్ని సాక్ష్యాలను అధారాలు సమర్పించామని, బండి సంజయ్ కి తనకు ఎమైనా గట్టు పంచాయితీ ఉందా? అలాగే బండి సంజయ్ కి చెందిన ఫోన్ తమ దగ్గరకి రాలేదని, అర్ధరాత్రి 1.14 నిమిషాలకు చివరి కాల్ వుందని, రాత్రి ఆ ఫోన్ చివరగా లోకేషన్ వెజ్జంకి వచ్చిందని, బండి సంజయ్ ఉక్రోషంతో వున్నారని పరువు నష్టం దావా వేసుకోవచ్చని, తాను పరువు నష్టం దావా వేయనని, ఎలాంటి వ్యక్తిగత కక్షలు లేవని, విచారణ చేస్తున్న పోలీసులకు సెంటిమెంట్ అనేది ఏమి ఉండదని. పరీక్ష పత్రం మాల్ ప్రాక్టీసు కేసు వ్యవహారానికి సంబంధించి చాలా మందికి నోటీసులు పంపామని, అందులో మీడియా ప్రతినిధులు కూడా
వున్నారని వాళ్ళను కూడా పిలుస్తున్నామని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో సెంట్రల్ జోన్ డిసిపి అబ్దుల్ బారీ, కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్. ఏసిపి తిరుమల్ పాల్గోన్నారు.