తెలంగాణ ఉద్యమం లో ఉద్యమ పార్టీ గా తెలంగాణ సాధనకోసం ముందుండి ఉద్యమాన్ని నడిపించి రాష్ట్ర సాధన అనంతరం పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన బి ఆర్ ఎస్ ఉద్యమకారులపట్ల ఇంకా చిన్న చూపు చూస్తుందని అనేక మంది ఉద్యమకారులు ఆవేదన చెందుతున్నారు…గులాబీ పార్టీ కోసం 2001 నుంచి ఎన్నో ఆటుపోట్లను,నిర్బందాలను,కేసులను ఎదుర్కొని అన్ని రకాలుగా నష్టపోయిన గులాబీ వీరాభిమానులను సైతం పార్టీ అధిష్టానం ఏమాత్రం పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు…అధికారం కోల్పోయిన తర్వాత కూడా గులాబీ అధినాయకత్వం లో మార్పు రాకపోవడం…ఉద్యమంతో,గులాబీ పార్టీని బలోపేతం చేయడంలో ఏమాత్రం భాగస్వామ్యం లేని నాయకులు వచ్చి పదవులు అనుభవించి అధికారం కోల్పోగానే పార్టీ కండువా మార్చుకుంటు కాంగ్రెస్, బీజేపీ ల్లో చేరుతున్న ఇప్పటికి పార్టీ అధిష్టానం చెక్కుచెదరకుండా బి ఆర్ ఎస్ కోసమే ఉన్న ఉద్యమకారులను పట్టించుకోకపోవడం దారుణమని వారు ఆవేదన చెందుతున్నారు…పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో వరంగల్ ఎంపీ స్థానాన్ని ఉద్యమకారులకు కేటాయించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పార్టీ కోసం కష్టపడ్డ ఉద్యమకారుల విన్నపాలను గులాబీ అధినేత పెడచెవిన పెట్టినట్లు కనపడింది… తెలంగాణ సాధనఉద్యమం లో తమ సర్వస్వం కోల్పోయిన ఉద్యమకారులు పదేళ్ల పాటు అధికారంలో ఉన్న తమ పార్టీ నుంచి ఎలాంటి పదవులు రాకున్న కేసీఆర్ వెంటే ఉన్న, కనీసం పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క ఉద్యమకారునికి సీట్ కేటాయించకపోవడం నిజంగా వారిపట్ల నిర్లక్షంగానే కనపడుతుంది… ఉద్యమకాలం నుంచి నేటివరకు గులాబీ బాటలోనే ఉద్యమకారులు ఉన్న అధినేత వారికి మొండిచెయ్యి చూపించడం పట్ల వారు నిరసన వ్యక్తంచేస్తున్నారు…మాకెందుకు వద్దు టికెట్ అంటున్నారు…
పార్లమెంట్ టికెట్ ఇవ్వాలి….
వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా తన అభ్యర్దిత్వాన్ని పరిశీలించి బి ఆఏ ఎస్ టికెట్ తనకు కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల కుమార్ గులాబీ అధిష్టానాన్ని కోరుతున్నారు…ఎలాంటి రాజకీయ అనుభవం ,ఉద్యమ చరిత్ర లేని కడియం కావ్యకు ఎంపీ టికెట్ కేటాయించడం పట్ల అధిష్టానం పునరాలోచించాలని ఆయన కేసీఆర్ ను కోరారు…కడియం కావ్యకు కడియం శ్రీహరి కూతురు అని తప్ప అదనంగా ఉన్న అర్హత ఏంటని కుమార్ ప్రశ్నిస్తున్నారు… గులాబీ పార్టీ ఉద్యమ పార్టీగా మొదలుపెట్టిన దగ్గరనుంచి ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా కేసీఆర్ వెంటే నడిచిన తమకు వరంగల్ పార్లమెంట్ టికెట్ ఎందుకు ఇవ్వరని ఆయన అన్నారు….
ఇదీ కుమార్ ఉద్యమ నేపధ్యం…
వరంగల్ పార్లమెంట్ టికెట్ విషయంలో కేసీఆర్ మరోసారి పునరాలోచించి తనకు టికెట్ కేటాయించాలని కోరుతున్న బత్తుల కుమార్ వరంగల్ ఎస్ ఆర్ ఆర్ తోట కరీమాబాద్ కు చెందినవారు… కేసీఆర్ టి ఆర్ ఎస్ స్థాపించిన 2001 లోనే ఆయన పార్టీ లో చేరారు… టిఆర్ఎస్ పార్టీ లో వివిధ పదవుల్లో కొనసాగారు… 2001లో 44 డివిజన్ (పాత డివిజన్) పార్టీ ప్రధాన కార్యదర్శి గా,2003 నుండి 2006 వరకు 44 డివిజన్ (పాత డివిజన్) పార్టీ అధ్యక్షులుగా,2006 నుండి వరంగల్ అర్బన్ యూత్ కార్యదర్శి 2007 లో వరంగల్ అర్బన్ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా నియమింపబడి ఇప్పటివరకు అదే పదవిలో కొనసాగుతున్నారు….బత్తుల కుమార్ పై 15 ఉద్యమ కేసులు 54 పోలీస్ అరెస్టులు ఉన్నాయి అలాగే వరంగల్ సెంట్రల్ జైల్ లో ప్రస్తుత పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు 2009 లో రెండు రోజులు జైల్లో ఉన్నారు….