“ఈ టి పి” ల జాడెక్కడ….?

రాంపూర్ ప్రాంతాన్ని కాలుష్యంగా మార్చుతున్న కొన్ని పారబాయిల్డ్ రైస్ మిల్లుల యాజమాన్యాలు కనీస నిబంధనలు పాటించకుండా తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి….ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి వారి ఇష్టారాజ్యం గా వ్యవహరిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు…. పారాబాయిల్డ్ రైస్ మిల్లులు వ్యర్టాల శుద్ధి కోసం ఈ టి పి ప్లాంట్ లను ఏర్పాటు చేయాల్సిఉండగా ఈ ప్లాంట్ లను ఏర్పాటు చేయకుండా మురుగునీరును మొత్తం బయటకి వదులుతూ మిల్లుల పరిసర ప్రాంతాలను మొత్తం కలుషితం చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి….. నిబంధనలకు విరుద్ధంగా కలుషిత నీటిని కెనాల్ లోకి వదులుతున్నట్లు తెలుస్తుంది….

నిబంధనలు ఎక్కడ……?

పారాబాయిల్డ్ రైస్ మిల్లులు నిర్వహించాలంటే కాలుష్యనియంత్రణ మండలి నిబంధనలు తప్పనిసరి .కానీ హన్మకొండ జిల్లా రాంపూర్ లో మాత్రం ఎటువంటి నిబంధనలు అవసరం లేదన్నట్లుగా మిల్లుల యాజమాన్యాలు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
అవును నిజం ఆ ప్రాంత రైస్ మిల్లులకు నిబంధనలతో పనిలేదట, అక్కడ ఉన్న ఏ పారాబాయిల్డ్ రైస్ మిల్లు నిబంధనల ప్రకారం ఉండదట,ఎందుకంటే ఆ ప్రాంత పొల్యూషన్ బోర్డ్ అధికారులు అక్కడ ఉన్న పారాబాయిల్డ్ రైస్ మిల్లు ల యజమానులతో కుమ్మక్కైయ్యారని అందుకే రాంపూర్ లో పారాబాయిల్డ్ రైస్ మిల్లర్ ల రాజ్యం నడుస్తోందని విశ్వసనీయ సమాచారం. అసలు విషయం ఏమిటంటే హన్మకొండ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ ప్రాంతంలో కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు తుంగలో తొక్కి ఎనిమిది పారాబాయిల్డ్ రైస్ మిల్లులు ఇష్టానుసారంగా నడుస్తున్నట్లు తెలిసింది. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం ఆ రైస్ మిల్లుల్లో “ఈ టి పి” ప్లాంట్ లు(Effluent Treatment Plant)వ్యర్థాల శుద్ధి కర్మాగారం ఉన్నప్పటికీ ఏ మిల్లులో కూడా ఆ ప్లాంట్ లు సక్రమంగా పనిచేయవని సమాచారం. ఇక కొన్ని మిల్లులు ఐయితే అసలు ఈ టి పి లు అసలే లేవని సమాచారం….ఈ టి పి లు ఏర్పాటు చేయకుండా మిల్లులు నడుస్తున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఆ మిల్లులపై చర్యలు తీసుకోకుండా వెనుకాడుతున్నట్లు తెలుస్తుంది….ఇలాంటి రైస్ మిల్లులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులే సహకారం అందిస్తూ చూసిచూడనట్లు వదిలేస్తున్నట్లు తెలియవచ్చింది…. ఈ టి పి ప్లాంట్ లేని,ఉన్న నిర్వహించకుండా వ్యర్థాలను బయటకు వదులుతున్న మిల్లుల పరిస్థితి ఏంటి అని పలువురు ప్రశ్నిస్తున్నారు…..ఇప్పటికైనా నిబంధనలు పాటించని మిల్లులపై అధికారులు చర్యలు తీసుకుంటారా…లేదా చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here