ఇన్స్యూరెన్స్ పేరుతో అక్రమ దందాకు తెరలేపి పట్టుబడ్డ ఆ ముఠా ఏ మాత్రం మారలేదు సరికదా వారి ఆగడాలు మరింతగా పెరిగాయట…అడ్డగోలుగా అక్రమ సంపాదనకు తెగబడ్డ ఆ ఇన్స్యూరెన్స్ ముఠా అదే దందాను కొనసాగిస్తున్నట్లు సమాచారం….అవును మరి
ఆ ముఠా ఏమాత్రం మారేలా లేదట, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ అక్రమ ముఠా ఆట కట్టించి జైలుకు పంపినా వారిలో ఏమాత్రం మార్పు కనిపించటం లేదట…అక్రమ దారిలో ఈజీ మనీకి అలవాటు పడ్డ వారు తిరిగి అదే దందాను కొనసాగిస్తున్నారని వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో జోరుగా ప్రచారం సాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇన్స్యూరెన్స్ అక్రమ దందా లో ఆరితేరిన “రాము”డు తన వ్యూహాలతో ఎప్పటికప్పుడు వ్యాపార పంథాను మార్చుతూ ఎవరికి చిక్కకుండా తన ఇన్సూరెన్స్ దందాను కొనసాగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల్లో చనిపోయే వారి పేర్లను ముందుగానే తన ముఠాతో తెలుసుకొని వారి పేరు మీద ఇన్సూరెన్స్ చేసి ఆ డబ్బులను కొట్టేసే సదరు ముఠా నాయకున్నీ గత సంవత్సరం క్రితం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని జైలుకు పంపించినప్పటికి అతగాడు తన ముఠా కలిసి తిరిగి అదే దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది…అయితే సదరు ముఠా నాయకుడు తన తెలివితేటలు ప్రదర్శించి ఎక్కడా ఎవరికి చిక్కకుండా తన దందాను సరికొత్త పద్ధతుల్లో నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అక్రమ ఇన్స్యూరెన్స్ ల ముఠా పై పోలీస్ బాస్ కనుక దృష్టి సారిస్తే అతగాడి దందా బయటపడే అవకాశం ఉందని మండలంలో చర్చ జరుగుతోంది… ఈ అక్రమ ఇన్స్యూరెన్స్ ల ముఠా దందాలకు పోలీసులు మరోసారి చెక్ పెడతారా…? చూడాలి మరి ….
దందా మాములుగా లేదు…
మరో సంచికలో….