తెలంగాణ తల్లి విగ్రహం రూపకల్పన పూర్తయ్యింది…విగ్రహ శిల్పులు విగ్రహాన్ని తీర్చిదిద్దారు..సీఎం రేవంత్ రెడ్డి చొరవతో గతంలో బి ఆర్ ఎస్ ఏర్పాటు చేసిన విగ్రహానికి భిన్నంగా విగ్రహానికి మెరుగులు దిద్దారు శిల్పులు…ఆకు పచ్చ చీరలో చేతిలో పచ్చని పైరు,ఇతర పంట మొక్కలతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించారు….మెడలో కొద్దీపాటి ఆభరణాలతో,చేతికి ఆకు పచ్చని,ఎర్రని గాజులతో తెలంగాణ తల్లి విగ్రహం రూపుదిద్దుకుంది…తెలంగాణ సచివాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని 9న ఆవిష్కరించనున్నారు…ఇప్పటికే విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తి కాగా కేసీఆర్, కిషన్ రెడ్డి లను సైతం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానిస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అంటున్నారు…ఆహ్వానం అందించడానికి సమయం ఇవ్వాలని ఆయన ఇప్పటికే వారిని కోరారు..