ఇంజనీర్ల లీకేజీ వర్కుల దందా…?

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు బరితెగించారు…సర్కార్ సొమ్మును అప్పనంగా మింగుతూ తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి….వేలల్లో చేసిన లీకేజీ పనులకు లక్షల్లో లెక్కలు చూపి సర్కార్ ఖజానాకు గండి పెడుతున్నట్లు సమాచారం…లక్షల్లో సర్కార్ సొమ్ము కాజేసి కొందరు ఇంజనీరింగ్ అధికారులు కోట్లకు పడగలెత్తి కోట్ల రూపాయలతో రాష్ట్ర రాజధానిలో విల్లాలు కొనేందుకు సిద్ధపడ్డట్లు సమాచారం…ఓ ఇద్దరు కాంట్రాక్టర్లను తమ చేతిలో ఉంచుకొని ఏ పని వచ్చిన ఎలాంటి టెండర్లు లేకుండా వారికి పని అప్పగించి వారితో కలిసి సర్కార్ సొమ్ము కాజేస్తున్నట్లు సమాచారం…గ్రేటర్ పరిధిలో అనేక లీకేజీ పనుల్లో ఈ ఇంజనీర్లు తమ ఇష్టారీతిన వ్యవహరించి తమకు తోచిన కాడికి దండుకున్నట్లు తెలుస్తుంది…

ఇదీ ఇంజనీర్ల చేతివాటం…?

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ లో అధికారులు రెచ్చిపోతున్నారు. అక్రమార్కులతో చేతులు కలిపి ప్రజా అవసరాలకు వినియోగించాల్సిన బల్దియా సొమ్మును కాంట్రాక్టర్లతో కుమ్మక్కై తమ జేబులు నింపుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి… గ్రేటర్ పరిదిలో చిన్నాచితక పనులను వేల రూపాయల్లో పూర్తి చేసి లక్షల్లో బిల్లులు చెల్లించేలా చేసి తిలా పాపం తలా పిడికెడు అన్న చందంగా వాటాలు పంచుకుంటు కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంజినీరింగ్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఆ అధికారులు నగరంలో ఎక్కడ రిపేర్లు, లీకేజీలు ఉన్నా ఆ ఇద్దరు కాంట్రాక్టర్లకు మాత్రమే వర్కులు దక్కేలా చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.టెండర్ వర్క్ అయినా నామినేషన్ అయినా ముందుగానే ఆ కాంట్రాక్టర్లకు లీకులు ఇస్తూ టెండర్ ఇంతకు కోట్ చేయాలో లీకులు ఇస్తూ ఆ పనులను వారికే కట్టబెట్టుతున్నారట. ఈ కాంట్రాక్టర్ల తో అంటకాగుతున్న ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఈ అధికారులు అనతికాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించుకున్నట్లు తెలుస్తోంది.కాగా అక్రమాలకు పాల్పడుతూ అడ్డగోలుగా సంపాధిస్తున్న ఇంజినీరింగ్ విభాగంలోని ఆ అధికారులకు త్రినగరికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ మహిళా ప్రజాప్రతినిధి వారికి అభయహస్తం ఇస్తున్నట్లు తెలుస్తుంది.ఆ మహిళా ప్రజా ప్రతినిధి అండతో అధికారులు రెట్టింపు ఉత్సహంతో అవినీతి పాల్పడుతున్నారన్న ఆరోపణలు లేకపోలేవు.ఇదిలా ఉంటే గ్రేటర్ కు చెందిన ఓ అధికార పార్టీ నాయకుడు ఇటీవల మున్సిపల్ కమిషనర్ ను ఇంజనీర్ల అక్రమాలపై పిర్యాదు చేసినట్లు సమాచారం.

కాంట్రాక్టర్లతో చేతులు కలిపి బల్దియా సొమ్మును కాజేసి కోట్ల రూపాయలు వెనకేసుకున్న అధికారుల అవినీతిపై ,అధికారులకు అభయహస్తం ఇస్తున్న ఆ మహిళ ప్రజా ప్రతినిధి పై న్యూస్ 10 ప్రత్యేక కథనం మరో సంచికలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here