ఆ కాంట్రాక్టర్లపై చర్యలుంటాయ…?

ఆ కాంట్రక్టర్ల పై చర్యలు ఉంటాయా లేక అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తారా… ? అనేది ఇప్పుడు ఎంజిఎం లో ప్రశ్నగా మిగిలింది… ఎంజీఎం డైట్ కాంట్రాక్ట్ టెండర్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ఆ ముగ్గురు కాంట్రాక్టర్లను ప్రస్తుత డైట్ కాంట్రాక్టుకు అనర్హులుగా ప్రకటించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు…జనగామ లో టెండర్ వేసి డిస్ క్వాలిఫై ఐయిన సరోజ క్యాటరింగ్స్ హాస్టల్స్ ,వనపర్తి లో డైట్ కాంట్రాక్ట్ పొంది సరైన ఫుడ్ అందించలేక చేతులెత్తేసి షోకాజ్ నోటీస్ అందుకున్న కృష్ణ కన్స్ట్రాక్షన్స్ అలాగే ఎంజీఎం లో డైట్ కాంట్రాక్ట్ దక్కించుకుని ఎవరు కాంట్రాక్టరో తెలియకుండా గందరగోళ పరిస్థితి ఏర్పరచిన కాంట్రాక్టర్ ను ప్రస్తుత ఎంజియం డైట్ కాంట్రాక్ట్ టెండర్ నుంచి అధికారులు పక్కన పెడతారా…?లేదా..?అనేది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది…మరి.ఈ విషయంలో అధికారులు నిర్ణయం తీసుకుంటార…లేక చూసిచూడనట్లు వదిలేస్తారా…? వేచి చూడాలి…మరోవైపు ఈ కాంట్రాక్టర్ల విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here