ఆ మిల్లులపై చర్యలకు రంగం సిద్ధం

మడికొండ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో పార బాయిల్డ్ రైస్ మిల్లులు నడుపుతూ కాలుష్యానికి కారకంగా మారుతున్న ఆ మిల్లులపై చర్యలు తీసుకునేందుకు ఇరిగేషన్ అధికారులు సిద్ధమైనట్లు తెలుస్తోంది…. ఈ పార బాయిల్డ్ రైస్ మిల్లుల నుంచి వస్తున్న కలుషిత నీరు మడికొండ చెరువులోకి మల్లిస్తున్న వీరిపై త్వరలోనే చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం… మిల్లుల్లో వ్యర్థశుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మిల్లులను నిర్వహిస్తున్న వీరు కాలుష్య కారకమైన నీటిని మొత్తం బయటకు వదులుతున్నారు….ఈ నీటిని అక్కడినుంచి మడికొండ చెరువులోకి వెళ్లేలా వీరు ఏర్పాట్లు చేసుకున్నారు….గతంలో వీరు ఈ కలుషిత నీటిని మిల్లులకు సమీపంలోనే ఉన్న దేవాదుల కాలువలోకి వదులుగా ఆ విషయాన్ని తన వార్త కథనాల ద్వారా న్యూస్10 వెలుగులోకి తీసుకురాగ దేవాదుల కాలువలోకి వెళ్లకుండా దేవాదుల అధికారులు అడ్డుకట్ట వేశారు… దింతో రూటు మార్చిన ఆ ముగ్గురు మిల్లర్లు ప్రస్తుతం కలుషిత నీటిని కాలువల ద్వారా మడికొండ చెరువులోకి వదులుతున్నారు…ఈ విషయాన్ని సైతం న్యూస్10 తిరిగి వెలుగులోకి తీసుకురాగా స్పందించిన ఇరిగేషన్ అధికారులు కలుషిత నీరు మడికొండ చెరువులోకి వెళ్తున్న విషయాన్ని పరిశీలించి ఆ విషయం నిజమేనని తేల్చి చర్యలకు రంగం సిద్ధం చేశారు…..కాగా మడికొండ చెరువు కాలుష్యం విషయంలో చర్యలు తీసుకోవడానికి కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు మాత్రం మనసు రావడం లేదు…. ఇప్పటికి అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెరువు కలుషితం ఐయితే మాకేంటి…?అన్నట్లు ప్రవర్తిస్తున్నారు… వీరి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here