ఆ మిల్లులపై ఇరిగేషన్ నజర్…..?

మడికొండ ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న పార బాయిల్డ్ రైస్ మిల్లుల కాలుష్యం పై ఇరిగేషన్ శాఖ అధికారులు స్పందించారు…ఇక్కడి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఉన్న మూడు పారాబాయిల్డ్ రైస్ మిల్లులకు చెందిన కలుషిత నీరు కాలువల ద్వారా మడికొండ చెరువులో కలుస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు నిర్దారణకు వచ్చినట్లు తెలుస్తోంది… మిల్లులకు చెందిన వ్యర్థపు నీరు చెరువులో కలుస్తున్నది నిజమేనని అధికారులు చెపుతున్నారు….ఆ మిల్లులు చేస్తున్న చెరువు కలుషితం పై ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు ఉన్నతాధికారులకు ఓ నివేదిక సమర్పించినట్లు సమాచారం….ఇరిగేషన్ అధికారుల నిర్ణయం మేరకు మిల్లులపై చర్యలకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది….మరోవైపు ఎలాంటి నిబంధనలు పాటించకుండా పార బాయిల్డ్ మిల్లులను నిర్వహిస్తూ యథేచ్ఛగా కలుషిత నీటిని చెరువులోకి దర్జాగా వదులుతూ తామేదో సమాజాన్ని ఉద్దరిస్తున్నట్లు పోజులు కొడుతున్న ఈ మిల్లుల యజమానులు చెరువులోకి కలుషిత నీరు వదలడం పై ఇప్పటికి స్పందించకపోవడం వారి బరితెగింపుకు నిదర్శనంగా కనపడుతుంది…. కాగా ఈ పార బాయిల్డ్ రైస్ మిల్లులు కలుషిత నీటిని బయటకువదులుతూ ఏకంగా మడికొండ చేరువునే కాలుష్య కాసారంగా మార్చుతున్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది… నిద్రావస్థలో ఉన్న కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఎవరి లబ్ది కోసం ఇలా వ్యవహరిస్తున్నారో వారికే తెలియాలి…. కాలుష్యానికి కారణం అవుతున్న వారిపై చర్యలు తీసుకోకపోగా తాము ఎంతో బిజీగా ఉన్నట్లు మాటలు చెప్పడం వారికే చెల్లింది…కాలుష్యాన్ని అరికట్టి,కాలుష్యానికి కారణం అవుతున్న వారిపై చర్యలు తీసుకోవడం తప్ప ఇంతకు మించి వారికి ఎం పని ఉంటుందో వారికే తెలియాలి….ఇప్పటికైనా నిర్లక్ష్యపు విధానాన్ని వీడి చర్యలు తీసుకుంటారా…లేక పైరవీలు తలొగ్గి నివేదికల పేరుతో కాలయాపన చేస్తారో చూడాలి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here