భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ లోని ఇసుక క్వారీల్లో అంతా ఇష్టారాజ్యం కొనసాగుతుంది…అడ్డు అదుపు లేకుండా ఇసుక దందా నడుస్తుంది….ఇందుకు అదుపు చేయాల్సిన టి ఎస్ ఎం డి సి అధికారులే సహకరిస్తున్నట్లు బహిరంగంగా విమర్శలు వినపడుతున్నాయి…నిబంధనలు గాలికి వదిలేసిన అధికారులు మామూళ్లతో సరిపెట్టుకుంటున్నట్లు ఇక్కడ ప్రచారం జరుగుతోంది….
యథేచ్ఛగా దందా…?
మహాదేవపూర్ లో యదేచ్ఛగా బకెట్ దందా నడుస్తున్నట్లు న్యూస్10 దృష్టికి వచ్చింది…బకెట్ దందా గూర్చి బయటకు పొక్కితే రెండు,మూడు రోజులు గుట్టుచప్పుడు కాకుండ ఉండే వారు ఆతర్వాత యధావిధిగా దందాను కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి….అధికారులు తమకేం పట్టనట్లు వ్యవహరిస్తుండటం వల్లే ఈ బకెట్ దందా అడ్డగోలుగా కొనసాగుతున్నట్లు సమాచారం… ఒక్కో వాహనం లో బకెట్ లకొద్ది ఇసుకను అక్రమంగా లోడ్ చేస్తూ కొంతమంది సిబ్బంది కావాల్సినంత దండుకుంటున్నట్లు బాగానే విమర్శలు వస్తున్నాయి…కాంట్రాక్టర్ లతో కుమ్ముకైనా అధికారులు బకెట్ అక్రమ దందాను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నట్లు తెలుస్తుంది…ఇకనైనా అధికారులు మహాదేవపూర్ క్వారీల్లో బకెట్ దందాకు చెక్ పెట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూస్తారా…లేక మామూళ్లతో సరిపెట్టుకొని అక్రమ దందాకు సహకరిస్తార… చూడాలి