ఆ ఎస్సై ఇష్టమే

చట్టాన్ని పరిరక్షించాల్సినకొందరు పోలీస్ అధికారులు అధికారాన్ని దుర్వినియోగ పరుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి…. అవినీతికి పాల్పడిన పోలీస్ అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్న కొందరు పోలీసు అధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు…తాజాగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సంగెం ఎస్సై భాదితులపైనే కేసు నమోదు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి…విచారణ పేరుతో నేరస్థులకే సహకరిస్తూ… అమాయకులను రోజుల తరబడి పోలీస్ స్టేషన్ చుట్టు తిప్పుతూ చుక్కలు చూపిస్తున్నారని భాదితులుఅంటున్నారు…ఎవరికి అనుమానం కలగకుండా ఒకరికి తెల్వకుండా మరొకరి దగ్గర నుంచి వేల రూపాయలు దండుకుంటున్నారని, డబ్బులు ఇవ్వని వారిపై కేసులు నమోదు చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారని.ఏ నేరంచేయని వారిపై ఎవరికి అనుమానం రాకుండా కేసులు నమోదుచేస్తూ సమయం వచ్చినపుడు అరెస్ట్ చూపుతు స్టేషన్ బేయిల్ ఇస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని భాదితులు పేర్కొన్నారు…ఈ విషయాలను పై అధికారులకు పిర్యాదు చేద్దామంటే పోలీస్ లతో ఎందుకు తలనొప్పి గమ్మున ఉండాల్సివస్తుందని పలువురు అంటున్నారు…. సంగెం ఎస్సై వ్యవహారంలో భాదితులు న్యూస్10 కు తెలిపిన వివరాల ప్రకారం…. వివరాల్లోకి వెళితే వరంగల్ జిల్లా కుంటపల్లి గ్రామానికి చెందిన రౌతు రాజయ్య, ఆకుల శివరాజం అనే వ్యసాయ అదారిత కుటుంబాల మధ్య కొన్నాళ్లుగా ఓ దారి విషయంలో గొడవలు కొనసాగుతున్నాయి….దీంతో రాజయ్యపై శివరాజం,ఆయన కుటుంబ సభ్యులు దౌర్జన్యానికి పాల్పడ్డారు….దింతో పోలీసులు శివరాజం తల్లి,ఆకుల నర్సమ్మ,తండ్రి శంకరయ్య పై 2022 డిసింబర్ 2 న కేసు నమోదు చేశారు.మరోకేసు 2023 జున్ 30 న శివరాజం మరో నలుగురి పైన దారికి అడ్డంగా బండరాళ్లు పెట్టి రాజయ్యను చితకబాదినందుకు అప్పడు సైతం వారిపై మరో కేసు నమోదు చేశారు.ఇలా రెండు కేసులు నమోదు కావటంతో ఈ కేసుల నుంచి బయటపడేందుకు శివరాజాం స్థానిక ఎస్ ఐ ఉన్న పరిచయంతో పైరవీలు మొదలుపెట్టాడు.రాజయ్య పై ఎలాగైనా కేసు నమోదు చేయాలని ఎస్సైకి విన్నవించుకున్నాడు .అంతేకాదు బాధితుడు రాజయ్య నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయాలని శివరాజం, ఎస్సై ప్లాన్ చేసినట్లు భాదితులు ఆరోపించారు….కాగా రాజయ్య పై కౌంటర్ కేసు ఫైల్ చేస్తే రాజిపడటానికి దారికోస్తాడని ఉచిత సలహాలు ఇచ్చిన ఎస్ ఐ రాజయ్య వద్దనుండి కూడ పదివేల రూపాయలు డబ్బులు వసూల్ చేసేందుకు ప్రయత్నం చేసినట్లు వారు చెప్పారు. ఈ ప్లాన్ బెడిసి కొట్టడంతో… దింతో చేయని నేరానికి రాజయ్యపై కేసుకు ప్లాన్ చేశారు.రాజయ్య తన వ్యవసాయ భూమి లో ట్రాక్టర్ తో దున్నిస్తున్న క్రమంలో హద్దురాయి విరిగిందని ,ఇది కావాలనే రాజయ్య కుట్ర పన్నాడని పోలీస్ లకు శివరాజం తో పిర్యాదు చేయించారు.ఈ క్రమంలో పోలీస్ లు విచారణ మొదలుపెట్టారు.ఈ విచారణలో సంగెం ఏ ఎస్ ఐ తో పాటు ఓ కానిస్టేబుల్ వ్యవసాయ భూమిని పరిశీలించారు.శివరాం ఇచ్చిన పిటిషన్ అదారంగా ఒక్కచోట హద్దురాయి విరిగిన మాట వాస్తవమేనని ,హద్దులు మాత్రం చెరిగిపోలేదని , మరో హద్దురాయిని తిరిగి దాని ప్రదేశంలో నాటమని విచారణ చేసిన ఏ ఎస్ ఐ, కానిస్టేబుల్ రాజయ్య కు చెప్పి వెళ్ళిపోయారు.అదేవిషయాన్నీ ఎస్సై కి చెప్పారు.అక్కడితో కథ ముగిసిందని అందరు బావించారు.కాని ఎస్సై కల్పించుకుని కొన్ని రోజులకు మళ్ళి విచారణ పేరుతో స్పాట్ మీదకు వెళ్లి పరిశీలించారు.ఎక్కడ ఏ ఆధారం లభించక పోవటంతో శివరాజం పై గతంలో పెట్టిన కేసుల విషయంలో రాజి పడాలని లేదంటే మీ మీద కేసులు నమోదు చేస్తామని ఎస్సై బెదిరింపులకు దిగారు.రాజయ్య ససేమీర వినకపోవటంతో 20 రోజుల తరువాత రాజయ్య పై స్థానిక ఎస్ ఐ 447,427 సెక్షన్ల క్రింద ఇటీవల కేసు నమోదుచేసి తన పోలీస్ ప్రతాపం చూపారు.

డిజిపి కి పిర్యాదు….


తనపై అక్రమంగా కేసులు నమోదు చేయడమే కాకుండా,తాను పెట్టిన కేసుల విషయంలో రాజీ పడాలని తనను బెదిరింపులకు గురిచేస్తున్న సంగెం ఎస్సై పై బాధితుడు రాజయ్య రాష్ట్ర డీజీపీ కి పిర్యాదు చేసారు….రాతపూర్వకంగా డీజీపీ ఎక్స్ (ట్విట్టర్) ద్వారా పిర్యాదు చేసినట్లు తెలిపారు…అకారణంగా కేసు నమోదు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్సై పై పోలీస్ బాస్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాలి…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here