ఆ ఇద్దరు పాయల్ శంకర్ వైపు…?

బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది…రాష్ట్ర అధ్యక్ష పదవి పగ్గాలు ఎవరి చేతికి వస్తాయా..అని కాషాయ కార్యకర్తలు ఎదురు చూస్తుండగా సమర్థుడైన నాయకుడికే ఈసారి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు బీజేపీ అధిష్టానం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది…కాగా ఈ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కొందరు నాయకులు టాప్ ప్లేస్ లో ఉండగా ఇంకొందరు నాయకులు తమకు నచ్చిన వారికి అనుకూలంగా అధిష్టానానికి లేఖలు ఇచ్చినట్లు తెలుస్తోంది…

ఆ ఇద్దరు పాయల్ శంకర్ వైపు….?

రాష్ట్రంలో బీజేపీ అధ్యక్ష పదవి విషయంలో ఓ వైపు సస్పెన్స్ కొనసాగుతుండగా కొంతమంది బీజేపీ సీనియర్ లీడర్లు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది…తాజాగా ఇద్దరు కేంద్ర మంత్రులు బండి సంజయ్,కిషన్ రెడ్డి లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను బలపరుస్తూ అతన్ని రాష్ట్ర అధ్యక్షుని చేయాలని ప్రతిపాదిస్తూ అధిష్టానానికి లేఖ రాసినట్లు సమాచారం…అధ్యక్ష పదవి రేసులో ఎంపీ లు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్ రేసులో ముందుండగా తాజాగా ఈ ఇద్దరు కేంద్ర మంత్రులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరు ప్రతిపాదించడం కొంతమేర గందరగోళ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తుంది…రేసులో ముందున్న ఈటల రాజేందర్,ధర్మపురి అరవింద్ ను కాదని వీరు ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేరును ప్రతిపాదించడం పట్ల ఆ ఇద్దరు ఎంపీలకు రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం ఈ ఇద్దరు కేంద్ర మంత్రులకు ఇష్టం లేదనే ప్రచారం సాగుతోంది…. కాగా తెలంగాణ పై ఈసారి బాగానే శ్రద్ద పెట్టిన అధిష్టానం ఇక్కడ ఉన్న పరిస్థితులపై ఓ నజర్ వేసినట్లు తెలిసింది… ఈ సారి ఎలాగైనా తెలంగాణలో మరింతగా బలపడాలని చూస్తున్న అధిష్టానం ఆ ఇద్దరు కేంద్ర మంత్రుల వ్యవహార శైలి పై పూర్తి అసంతృప్తిగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది…కమలం పార్టీ కి చెందిన కొందరైతే ఓ అడుగు ముందుకువేసి ఇద్దరిలో ఒకరికి పదవీ గండం సైతం ఉందని అంటున్నారు….

ఆ ఇద్దరివైపే అధిష్టానం మొగ్గు…..?

ఇదిఇలాఉండగా ఈసారి మరింత సమర్థుడైన అందులో బిసి సామాజిక వర్గానికి చెందిన నాయటకున్ని రాష్ట్ర అధ్యక్షుడిని చేయాలని భావిస్తున్న బీజేపీ అధిష్టానం ఎంపీ లు ఈటల రాజేందర్,ధర్మపురి అరవింద్ లవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది…ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అందించేందుకు అధిష్టానం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం…. అంతేకాదు రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెడితే బాగుంటుంది అనే విషయంలో బీజేపీ అధిష్టానం ఇప్పటికే కేంద్ర నిఘా వర్గాల నుంచి ఓ నివేదిక తెప్పించుకున్నట్లు తెలిసింది…దింతో ఇద్దరు ఎంపీ ల్లో ఎవరికో ఒకరికి అధ్యక్ష పదవి కట్టబెట్టడం ఖాయంగా కనిపిస్తుందని కాషాయ వర్గాల్లో టాక్ నడుస్తుంది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here