జనగామ ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న వసూళ్ల వ్యవహారంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ చేస్తారా లేదా అనేది ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో జరుగుతున్న వసూళ్ల దందాపై ఆ దందాను నడిపిస్తున్న ఆ ఇద్దరి పై న్యూస్-10 వరుస కథనాలను ప్రచురిస్తున్న నేపథ్యంలో ఈ ఇద్దరధికారుల భాదితులు న్యూస్-10 నిఘా టీమ్ తో వారి గోడును వెళ్లబోసుకుంటున్నారు .కార్యాలయంలో పరిపాలనాధికారి తోపాటు జూనియర్ అసిస్టెంట్ లంచాలకే అధిక ప్రాధాన్యం ఇస్తూ లంచాలు ఇవ్వని వాహదారులకు నిబంధనల పేరుతో కొర్రీలు పెడుతున్నారని విశ్వసనీయ సమాచారం.
జిల్లా వాహనదారులు ఇతర జిల్లాలకు వాహనాలను అమ్మాలంటే ఈ ఇద్దరధికారుల అసిస్టెంట్ లకు మామూళ్లు ఇవ్వాల్సిందే. వాహనదారుడు క్లియరెన్స్(సిసి) సర్టిఫికేట్ కోసం కార్యాలయానికి వెళ్తే వాహనాన్ని బట్టి వారికి లంచాలను ముట్టజెప్పాల్సిందే. ఉదాహరణకు మోటార్ సైకిల్ కు 2వేలు, మోటార్ కారుకు 4 వేలు,ట్రాక్టర్ కు 5వేలు హార్వెస్టర్ కు 10 వేలు వసూళ్లు చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. పాత వాహనాల పేరు మార్పిడికి, కొత్తవాహనాల రిజిస్ట్రేషన్ కొరకు ప్రతి పనికి వేల రూపాయలు వసూళ్లు చేస్తున్న వీరి వ్యవహారం పై,వారి అక్రమ ఆస్తులపై ఏసిబి అధికారులు ,ఐటి అధికారులు విచారణ చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఇప్పటికైనా ఏసిబి అధికారులు ఈ లంచాల వ్యవహారం పై విచారణ చేసి ఆ ఇద్దరధికారులపై చర్యలు తీసుకుంటారో లేదో వేచిచూడాల్సిందే