భూముల ధరలకు రెక్కలు రావడంతో భూమి ఉంటే చాలు సంపద పోగేయొచ్చు అనే భావనతో కొంతమంది అక్రమార్కులు తమది కాని భూమిని సైతం ఎలాగో ఓలాగ దక్కించుకోవాలని కబ్జా రాయుళ్ల అవతారం ఎత్తుతున్నారు….భూమి కనపడితే చాలు పాగా వేసేందుకు తమ వక్ర బుద్ధికి పదును పెట్టి భూమి తమ హస్తగతం చేసుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు….తమకున్న కబ్జా బుద్ధితో అది సర్కారు భూమి,ప్రయివేటు భూమి,దేవాలయ భూమి అని చూడడం లేదు…భూమి ఎవరిదైన లెక్క చేయకుండా కబ్జా చేస్తున్నారు….
ఆలయ భూమి కబ్జా….?
సరిగ్గా ఇలాంటి అక్రమ కబ్జా బుద్ధి తోనే కొందరు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం లోని నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూమిని కొందరు కబ్జా చేశారు 95,96 సర్వే నంబర్ లో ఉన్న ఆలయ భూమిని కబ్జా చేసిన వీరు అక్రమ నిర్మాణాలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి…గుడి భూమి అని తెలిసిన కూడా తమ కబ్జా బుద్ధికి పనిచెప్పి అక్రమ మార్కులు ఈ భూమిలో పాగ వేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది…95,96 సర్వే నంబర్ లో మొత్తం రెండు ఎకరాల ఇరవై గుంటల భూమి ఉండగా ఈ భూమిని ముప్పై సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపం కోసం ఆ స్థలాన్ని కేటాయించిన అదేమి లెక్క చేయకుండా విలువైన భూమిని కొందరు కబ్జా పెట్టినట్లు తెలిసింది…ఈ భూమి కబ్జా ఐయిన ఎవరు ప్రశ్నించక పోవడం అధికారులు సైతం ఏమాత్రం పట్టింపు లేనట్లు వ్యవహరిస్తుండడంతో కబ్జా రాయుళ్లు మరింతగా రెచ్చిపోతున్న ట్లు తెలియవచ్చింది…
భూ సర్వే చేయిస్తాం….
దేవస్థాన ఈ ఓ అన్నపూర్ణ
నాచారం గుట్ట ఆలయం భూమి కబ్జా విషయమై ఆలయ ఈ ఓ అన్నపూర్ణ ను న్యూస్10 వివరణ కోరగా తాను ఆలయ భూమిని పదిహేను రోజుల్లో సర్వే చేయిస్తానని అన్నారు…సర్వే లో ఆలయ భూమి కబ్జా ఐయినట్లు తేలితే కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు….ఆలయ భూమి ఎంత మేరకు కబ్జా ఐయిందో లెక్క తెలుస్తామని అన్నారు…95,96 సర్వే నంబర్ లో ఉన్న భూమి పహానిలు ఆలయం పేర ఉన్న ఆ భూమిని ఎప్పుడో టి టి డి కళ్యాణ మండపం కోసం కేటాయించారని ఆమె తెలిపారు…