నగరంలో బరితెగించిన కార్పొరేట్ విద్యా మాఫియా తన రూటు మార్చింది.సంబంధిత శాఖ అధికారుల కళ్లుకప్పి తమ వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తుంది. అనుమతులు లేకుండా అదనంగా అక్రమంగా నిర్వహిస్తున్న కళాశాలలకు అకాడమీ పేరుతో బోర్డులు తగిలించి విద్యార్థుల తల్లిదండ్రులను అందిన కాడికి నిలువు దోపిడీ చేస్తుంది. ఐఐటి ,జేఈఈ ,నీట్ కోచింగ్ అంటూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న ఆల్ఫోర్స్ కళాశాల కూడా ఈ కోవాకు చెందినదే.నగరంలో విచ్చలవిడిగా బ్రాంచీలు ఏర్పాటు చేసి విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతులు లేకుండానే అడ్మిషన్లు తీసుకుంది. డే స్కాలర్స్ ,రెసిడెన్షియల్ ఏసి, నాన్ ఏసి క్యాంపస్ ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటూ సొమ్ము చేసుకుంటుందని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వరంగల్ పోచమ్మ మైదాన్, హనుమకొండలోని కెఎల్ఎన్ రెడ్డి కాలనీ కేంద్రంగా అనుమతులు లేకుండా ఆల్ఫోర్స్ కళాశాలలను ఏర్పాటు చేసి విద్యాశాఖ అధికారుల కళ్ళుగప్పి కళాశాలల యజమాన్యాలు విద్యార్థులను మోసం చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అనుమకొండ జిల్లాలో 38268,38271,38309 కళాశాలల కోడ్ కలిగిన మూడు కాలేజీలకే అనుమతులు ఉండగా అదనంగా వరంగల్, హనుమకొండ పట్టణ కేంద్రాల్లో ఒక్కొక్క బ్రాంచీలు అదనంగా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ శృతి ఓఝా అనేకసార్లు అనుమతి లేని కళాశాలలో గుర్తించి వాటిని వెంటనే మూసివేయాలని అలాంటి కళాశాలలో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకొని మోసపోవద్దని తెలిపినప్పటికీ కళాశాలల మోసపూరితమైన ప్రకటనలు నమ్మిన తల్లిదండ్రులు లక్షల్లో ఫీజులు చెల్లించి మోసపోతున్నారనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. ఏది ఏమైనప్పటికి కార్పొరేట్ విద్య పేరుతో విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న ఆల్ఫోర్స్ కళాశాలలపై ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు ఎందుకు మౌనంగా ఉంటున్నారో అర్థం కావట్లేదని పలువురు చర్చించుకుంటున్నారు వేచి చూడాలి మరి అనుమతి లేని ఆల్ఫోర్స్ కళాశాలలపై అనుమకొండ వరంగల్ డిఐఈఓ లు ఏ విధంగా స్పందిస్తారో మరి….