అరకొర వసతులు…అడ్డగోలు అడ్మిషన్లు

నగరంలో శివాని కళాశాలలో బరితెగింపుతనానికి విద్యాశాఖ అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల తల్లిదండ్రుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని శివాని కళాశాలల యాజమాన్యం అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటుంది. నగరంలో ఆల్ ఇండియా ర్యాంకులు శివానికే సొంతం అంటూ భారీ ప్రకటనలతో విద్యార్థులకు కుచ్చుటోపి పెడుతుంది.నగరంలో అనుమతులు లేకున్న బ్రాంచీలకు ఆకర్షణీయమైన పేర్లు పెడుతూ అడ్డగోలుగా అడ్మిషన్లకు తెగబడుతుంది,మూడు బ్రాంచ్ ల పర్మిషన్లతో ఏడుకు పైగా క్యాంపస్లు ఏర్పాటు చేసి బ్రాంచ్ ఏసీ ,నాన్ ఏసీ బాయ్స్ గర్ల్స్ వేరువేరు భవనాలు అంటూ విద్యా వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తోంది.అనుభవం,అర్హత లేని వారినే నిష్ణాతులైన అధ్యాపకులంటూ తప్పుదోవ పట్టిస్తూ విచ్చలవిడిగా అడ్మిషన్లు చేర్చుకుంటు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తుంది.విద్యా శాఖ నుండి పర్మిషన్ లేకున్నా స్పెషల్ బ్యాచ్ ల పేరుతో లక్షల్లో ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తూ వారిని ఆర్ధికంగా మరింత వెనుకకు నెట్టివేస్తుందన్న ఆరోపణలు విద్యార్థి సంఘాల నుండి వెల్లువెత్తుతున్నాయి.తప్పుడు ప్రకటనలు చూసి ఫీజుల భారం మోయలేక నిరుపేద తల్లిదండ్రులు అప్పులపాలవుతున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తూ కార్పొరేట్ యాజమాన్యాలకు కొమ్ముకాస్తున్నారనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు, సొంత ఇంటిని తలపించేలా వసతి సదుపాయమంటూ ప్రకటనల్లో ఉదరగొడుతూ అద్దె భవనాల్లో ఇరుకు గదుల్లో విద్యార్థులను ఇక్కట్ల పాలుచేస్తున్నారు,శివాని కళాశాలల ఆగడాలు గతంలో అనేకం వెలుగులోకి వచ్చిన విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు,అదే అదనుగా భావించిన శివాని యాజమాన్యం దేకో మై దందా అంటూ నేటికీ తన విద్యా వ్యాపారాన్ని యథేచ్ఛగా కొనసాగిస్తూ అధికారులకు సవాల్ విసురుతోంది..ర్యాంకుల కోసం కళాశాల యాజమాన్యం అటు విద్యార్థులను ఇటు ఫీజుల కోసం వారి తల్లిదండ్రులను వేధింపులకు గురి చేస్తూ వారి ఆత్మహత్యలకు కారణమవుతుందని, గత విద్యా సంవత్సరం సాహిత్య అనే విద్యార్థి కాలేజీ భవనం నుండి దూకి బలవన్మరణానికి పాల్పడిన ఘటనకు యాజమాన్య వేధింపులే కారణమని విద్యార్థి నేతలు ప్రజా సంఘాలు బలంగా ఆరోపించినా నేటికి విద్యాశాఖ అధికారులు శివాని కళాశాలలపై ఏ మాత్రం చర్యలు తీసుకోకపోవడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.ఇప్పటికైనా జిల్లా ఇంటర్ విద్యా శాఖ అధికారులు స్పందించి అనుమతులు లేకుండా విద్యను వ్యాపారం చేస్తున్న శివాని కలశాలలపై చర్యలు తీసుకుంటారో లేక వారు ఇచ్చే తాయిలాలకు తలొంచుతారో వేచి చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here