అమాత్య నజర్ వేయండి

అమాత్య మీరు రవాణాశాఖపై కొంచెం నజర్ వేయాల్సిన అవసరం ఎంతైనాఉంది… గత ప్రభుత్వ అండదండలతో ఈ శాఖలో తాను ఆడింది ఆటగా పాడింది పాటగా వ్యవహరించిన అక్రమ ప్రమోషన్ల డి టి సి “పాపా”లరాయుడి ఆగడాలపై విచారణ చేస్తే శాఖలో జరిగిన అవినీతి మొత్తం బయటపడే అవకాశం ఉంది….తనకన్నా దాదాపు నలభై మంది సీనియర్ అధికారులను కాదని అక్రమంగా ఒకే సంవత్సరంలో ఏకంగా మూడు ప్రమోషన్లు పొంది….గత ప్రభుత్వ పెద్దలు తన సామాజికవర్గానికి చెందిన వారనే ధీమాతో పైరవీలు చేసి తనతో పాటు మరో ఇద్దరికి ఇదే రీతిన అక్రమంగా ప్రమోషన్లు ఇప్పించి రవాణాశాఖలో దందా కొనసాగిస్తున్న “పాపా”లరాయుడి పై తక్షణమే మంత్రి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు రవాణాశాఖలో వెలువడుతున్నాయి… గత ప్రభుత్వం పూర్తిగా తాను చెప్పినట్లు వింటుందని రవాణాశాఖలో చిరుద్యోగులను ,ఇతర అధికారులను తన అధికార దర్పంతో వేధింపులకు గురిచేసిన “పాపా”లరాయుడి ఆగడాలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాఖ పరమైన విచారణ జరిపి ఇంకోసారి రవాణాశాఖలో ఏ ఉద్యోగి అక్రమాలకు పాల్పడకూడదనే సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది….రవాణాశాఖలో ఇంకా తన పెత్తనమే నడవాలని పెత్తనం కోసం ఇంకా వెంపర్లాడుతున్న అక్రమ ప్రమోషన్ల డిటిసి “పాపా”లరాయుడి పై రవాణాశాఖ మంత్రి చర్యలు తీసుకోవాలనే డిమాండ్ సర్వత్రా వినపడుతోంది… మంత్రి నిర్ణయం కోసం ఉద్యోగులు సైతం ఎదురుచూపులు చూస్తున్నట్లు తెలుస్తుంది…..రవాణాశాఖ పై మంత్రి సమీక్ష నిర్వహించి అక్రమ ప్రమోషన్ల డిటిసి ల విషయంలో నిజాలు నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది…..మరి ఈ విషయంలో రవాణాశాఖ మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here