అనుమతులతో పనేంది….?

హన్మకొండ,వరంగల్ జిల్లాలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల అసోసియేషన్ నేతలు కాలేజీల నిర్వహణలో వారు ఆడింది ఆట పాడింది పాట అన్న చందంగా మారిందనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. మేము యూనియన్ నేతలం  మాకు విద్యాశాఖ అనుమతులతో పనేంటి…?మమ్మల్ని అడిగే ధైర్యం ఎవరికి ఉందనుకున్నారో ఏమో. ఏది ఏమైనా వి డోంట్ కేర్ అంటూనే తమ విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.ఒకవేళ అధికారులు అడిగిన ,విద్యార్థి నాయకులు ప్రశ్నించిన కళాశాల ముందు ధర్నా చేసిన కేసులు పెడతామంటూ బెదిరించడం ఆ తర్వాత వారితో రహస్యంగా రాజీకి రావడం మా దందాకు అడ్డురావొద్దంటు ఒప్పందం చేసుకోవడం పరిపాటిగా మారినట్లు తెలుస్తుంది.ఒకే అనుమతితో అరకొర వసతులతో రెసిడెన్షియల్ కళాశాలలు నిర్వహిస్తూ గర్ల్స్, బాయ్స్ సపరేట్ క్లాసులు నిర్వహిస్తూ లక్షల్లో ఫీజులు వసూలు దండుకుంటు దేకో మై దందా అంటూ అటు విద్యాశాఖ అధికారులకు ఇటు విద్యార్థి సంఘాల నేతలకు సవాల్ విసురుతున్నారు. నగరంలో కార్పొరేట్ మాఫియాగా ఏర్పడ్డ కళాశాలలపై విద్యాశాఖ అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే మేము కళాశాలల యజమాన్య యూనియన్ నాయకులం మాకు నోటీసులు ఇవ్వడం తప్ప మీరేం చేయలేరంటూ సంబంధిత అధికారులకే చాలెంజ్ విసురుతూ రాజకీయ నేతల పలుకుబడితో వారి చర్యలను నిలువరిస్తున్నట్లు సమాచారం.ఒక్క హన్మకొండ జిల్లాలోనే నేటి వరకు ఇంటర్ విద్యాశాఖ గుర్తించిన ప్రైవేట్ అన్ ఎయిడెడ్ కళాశాలలు 73 కాగా ఇందులో ఆరు మాత్రమే బాలికలకు, రెండు మాత్రమే బాలురకు ప్రత్యేక విద్యా బోధనకై అనుమతి పొందినట్లు తెలుస్తోంది. మిగతా 65 కళాశాలలు కో ఎడ్యుకేషన్ పేర అనుమతి పొంది బాయ్స్ గర్ల్స్ వేర్వేరు క్యాంపస్లు అంటూ అదనపు బ్రాంచీలు నడుపుతున్నట్లు సమాచారం.పైగా వీరు నడుపుతున్న అనుమతి లేని బ్రాంచీలలో నీట్ ,ఐఐటి, జేఈఈ ,మెయిన్స్ కోచింగ్ లంటూ అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘించిన కళాశాలల జాబితాలో యూనియన్ నాయకులమంటు గొప్పగా చెప్పుకునే వారి కాలేజీలే ముందు వరుసలో ఉండటం గమనార్హం. పది మందికి ఆదర్శంగా ఉండాల్సిన ప్రయివేటు కళాశాలల నేతలకు విద్యాశాఖ నిబంధనలు ఎందుకు పట్టవో అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అసోసియేషన్ నేతలు అయితే మాత్రం అనుమతులు లేకుండా కాలేజీలు నిర్వహిస్తూ పేద విద్యార్థుల తల్లిదండ్రులను అడ్డగోలుగా దోచుకునే హక్కు ఎవరిచ్చారో అన్న ప్రశ్న విద్యార్థుల తల్లిదండ్రులు  నుండి వినిపిస్తోంది. అనుమతులు లేని సదరు కళాశాలల యజమానులు ఆర్ధికంగా ,రాజకీయంగా పలుకుబడి ఉన్న వారు కావడంతో  ఇంటర్మీడియట్ ఆర్జెడి, డిఐఈఓ లు కూడా చర్యలకు వెనుకాడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. కార్పొరేట్ కళాశాలల యజమానులకు యూనియన్ నేతలకు సంబంధిత అధికారులు కొమ్ము కాయటం మూలంగా నిరుపేద తల్లిదండ్రులు దోపిడీకి గురవుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు..వేచి చూడాలి మరి ఇప్పటికైనా అధికారుల సిద్ధపడుతారో లేదో…

ప్రయివేటు కలశాలల అసోసియేషన్ నాయకులమంటూ అనుమతులు లేకుండా అదనపు బ్రాంచీలు నిర్వహిస్తూ తమ పిల్లలకు ఉన్నత ప్రమాణాలు కలిగిన విద్యా భోధనను అందించి వారికి బంగారు భవిష్యత్తును కల్పించాలని కలల కనే తల్లిదండ్రులను కార్పొరేట్ విద్య పేరుతో నిలువునా దోచుకున్న హన్మకొండ వరంగల్ నగరాల్లోని కళాశాలపై న్యూస్ 10 వరుస కధనాలు త్వరలో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here