జనగామ జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో మామూళ్ల దందా మొత్తం అక్కడి డి టి ఓ కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి…తనకు ప్రభుత్వం లోని పెద్ద స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఉన్నాయని తన సామాజిక వర్గానికి చెందిన వారే అధికారంలో ఉన్నారని వారు తమకే సహకరిస్తారని కార్యాలయంలో అక్రమంగా వసూళ్లు చేసిన ఏంకాదని ఈ అధికారి తన కిందిస్థాయి అధికారులకు భరోసా ఇస్తున్నట్లు తెలిసింది…. తనపై ఎవరు చర్యలు తీసుకోవాలని చూసిన ఏకంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితే రంగంలోకి దిగుతుందని డి టి ఓ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నట్లు జనగామ రవాణాశాఖ కార్యాలయంలో ఉద్యోగుల మధ్య గుసగుసలు వినిపిస్తున్నాయి… పై స్థాయిలో వారు ఉన్నారు కనుకనే కార్యాలయంలో తాను ఏంచేసిన చెల్లుబాటు అవుతుందనే ధీమాలో డి టి ఓ ఉన్నట్లు తెలిసింది…
ఏ సి బి ఏం చేయదు…?
జనగామ ఆర్టీఏ కార్యాలయంలోని ఏఓ , జూనియర్ అసిస్టెంట్లు అవినీతి నిరోధక శాఖ(ఏసిబి)అధికారులకే సవాల్ విసురుతున్నట్లు తెలుస్తోంది. ఏసిబి అధికారులు తనను పట్టుకొని తాను సస్పెండ్ అయినా మళ్ళీ ఇదే కార్యాలయానికి వస్తానని ఏఓ ఏజెంట్ లతో గొప్పలు చెప్పుకుంటున్నట్లు తెలుస్తుంది…. కాగా తనకు రాష్ట్ర యూనియన్ నాయకుల అండదండలు ఉన్నంతకాలం తనను ఏవరేంచేయలేరని జూనియర్ అసిస్టెంట్ ప్రచారం చేసుకుంటున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఇద్దరు అధికారుల వసూళ్ల భాగోతం పై న్యూస్-10 వరుస కథనాలను వెలువరిస్తుండడంతో ఈ ఇద్దరధికారుల అసిస్టెంట్ లలో కంగారు మొదలవ్వగా మనకేం కాదని అంతా పెద్దసారు చూసుకుంటారని వసూళ్ల విషయంలో ఏమాత్రం తగ్గొద్దనిఏ వారికి భరోసా కల్పిస్తున్నారని తెలిసింది.కార్యాలయానికి వచ్చే వాహనదారులను వీరిద్దరూ నిలువుదోపిడీ చేస్తున్న విషయం డిటీఓ కు తెలిసినప్పటికీ ఆ సారు మాత్రం తనకేంపట్టనట్లు ఉండడం చూస్తుంటే అసలు వీరిద్దరిని ఆ సారే ఎంకరేజ్ చేస్తున్నాడా….? అనే అనుమానాలు సగటు వాహనదారుల్లో వ్యక్తమవుతున్నాయి. అసలు విషయం ఏమిటంటే మామూళ్ల ను బూస్ట్ లుగా పేరు మార్చిందే ఆ సారు అని ఆయనకు ప్రస్తుతం భారత జాగృతి లో ఉన్న కీలక నాయకురాలు చుట్టమని అందుకే ఈ సారు ఏ విషయంలో తగ్గడని ఆర్టిఏలో జోరుగా ప్రచారం సాగుతోంది.కార్యాలయానికి వచ్చే వాహనదారుల నుండి మామూళ్ల రూపంలో వసూళ్లకు పాల్పడుతున్న ఏఓ, జూనియర్ అసిస్టెంట్ లతోపాటు ఆ సారు బూస్ట్ ల వ్యవహారం పై “ఏసిబి” అధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుకుంటున్నారు. న్యూస్-10 లో వరుస కథనాలు వెలువడుతున్నప్పటికి “ఏసిబి” అధికారులకే సవాల్ విసిరేలా వసూళ్లకు పాల్పడుతున్న ఆ ఇద్దరి పై “ఏసిబి” అధికారులు ఎలాంటి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.