వరంగల్ – ఖమ్మం – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా వరంగల్ జిల్లాకు చెందిన ఏనుగుల రాకేష్ రెడ్డి ని గులాబీ అధినేత కేసీఆర్ ప్రకటించారు….ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుండి బి ఆర్.ఎస్ లో చేరారు…ఉమ్మడి వరంగల్, ప్రస్తుత హన్మకొండ జిల్లాలోని హాసన్ పర్తి మండలం, వంగపహాడ్ సొంత గ్రామం….సామాన్య రైతు కుటుంబం నుండి వచ్చిన రాకేష్ రెడ్డి . బిట్స్ పిలాని లో యం యం ఎస్
ఎం యస్ పూర్తి చేశారు.సిటీ బ్యాంక్ మేనేజర్ గా, జేపీ మోర్గాన్, ఫేస్బుక్ లాంటి పలు అంతర్జాతీయ కార్పోరేట్ కంపెనీల్లో బెంగళూరు, అమెరికాలలో ఏడేళ్ల పాటు ఉన్నతస్థాయిలో ఉద్యోగాలు చేసి రాజకీయాలపై ఆసక్తి తో రాజకీయాల్లోకి ప్రవేశం చేశారు..2013 లో భారతీయ జనతా పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ బీజేపీ లో బి జె వై ఎం రాష్ట్ర కార్యదర్శిగా, రెండు పర్యాయాలు రాష్ట్ర అధికార ప్రతినిధి గా పనిచేశారు.బీజేపీ లో వరంగల్ పశ్చిమ టికెట్ ఆశించిన రాకేష్ రెడ్డి వరంగల్ కేంద్రంగా అనేక ఆధ్యాత్మిక, సామాజిక, సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి చొచ్చుకెళ్ళారు.ఉన్నత విద్యావంతుడు, మంచి వాగ్ధాటి, క్లీన్ ఇమేజ్ తో పాటు, క్లిష్ట పరిస్థితుల్లో సైతం ఫలితాలు రాబట్టగల సమర్ధత, కష్టపడి పనిచేసే సొంత టీమ్ ఉంటడం వారికి కలిసొచ్చే అంశాలు. యువతలో, విధ్యావంతులలో మంచి పట్టున్న రాకేష్ రెడ్డికి రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు, మంచి ఫాలోయింగ్ ఉండటం తో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గా కెసిఆర్ ప్రకటించినట్లు తెలిసింది…
ఇప్పటికే కాంగ్రెస్ తమ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న ను ప్రకటించిన నేపథ్యంలో అందుకు దీటైన అభ్యర్థిని దించడం కోసం తీవ్ర కసరత్తు చేసిన బి ఆర్ ఎస్ అధిష్టానం పలువురి పేర్లు పరిశీలించి ఫైనల్ గా ఏనుగుల రాకేష్ రెడ్డి నే ఫైనల్ చేసింది.